Homeలైఫ్ స్టైల్ఆలుగడ్డలతో ఐస్ క్రీమ్...

ఆలుగడ్డలతో ఐస్ క్రీమ్…

ఐస్ క్రీమ్ అనే మాట వింటే పిల్లలు, పెద్దలు అనే తేడా లేకుండా అందరూ… లొట్టలేసుకుంటారు. బయటపడలేని వాళ్లు మొహమాటంగా అయినా సరే తినడానికి రెడీ అయిపోతారు. ఎండాకాలం లో కిలో ప్యాక్ లు తెచ్చి ఇంట్లో ఫ్రిడ్జ్ లో పెట్టుకుని తినేవాళ్లు చాలా మందే ఉన్నారు. ఫంక్షన్స్ కి వెళితే ఎవరి కంటపడకుండా రెండో ఐస్ క్రీమ్ తినడానికి వేసే ప్లాన్లు అన్నీ ఇన్నీ కావు. మరి అలాంటి  ఐస్ క్రీమ్ ఆలు గడ్డలతో తయారు చేస్తే…

ఏదైనా బేకరీకి గాని, రెస్టారెంట్ కి గాని వెళితే ఐస్ క్రీమ్ ఆర్డర్ చేయడానికి చూసినపుడు మనం అందులో ఎన్నో ఫ్లేవర్లు చూస్తుంటాం. వెనిలా, చాక్లెట్, స్ట్రాబెర్రీ, పిస్తా, బటర్ స్కాచ్… ఇలా రకరకాల ఫ్లేవర్లు మనం ఎప్పటినుండో చూస్తున్నవే… అయితే ఫ్రూట్స్ అయిన మామిడి, జామ, సీతాఫల్ వంటి పండ్ల ఫ్లేవర్ లతో కూడా ఐస్ క్రీమ్ లు రావడం చూస్తుంటాం. కానీ ఆలుగడ్డలతో ఐస్ క్రీమ్ మాత్రం ఎక్కడ చూసి ఉండము. మరి ఈ ఆలుగడ్డల ఐస్ క్రీమ్ ఎక్కడ తయారుచేస్తారు..?

ఆలు ఐస్ క్రీమ్ టేస్ట్ ఎలా ఉంటుంది అని ఊహించుకుని, ఐస్ క్రీమ్ మీద ఇష్టాన్ని పోగొట్టుకోకండి… ఎందుకంటే ఈ ఐస్ క్రీమ్ తినడానికి కాదు… కేవలం ఫోటోషూట్ కోసం మరియు వీడియో మేకింగ్ కోసం. మనం చూసే ఎన్నో ఐస్ క్రీమ్ యాడ్స్ లో ఐస్ క్రీమ్ ని ఆలు మాష్ చేసి తయారు చేస్తారు. కారణం యాడ్ షూట్ అయ్యే వరకు నిజం ఐస్ క్రీమ్ అయితే కరిగిపోతుంది, అదే ఆలుతో చేసి, మీద క్రీమ్ గార్నిష్ చేస్తే కావలసిన అంతసేపు అది అలాగే ఉంటుంది. సో ఐస్ క్రీమ్ లు టి.వి. లో చూసి నోరు ఊరిపోతోంది అనుకోకండి మీరు చూసేది ఐస్ క్రీమ్ కాదు ఆలు మ్యాషాప్.

RELATED ARTICLES

Latest News

Recent Comments