Homeలైఫ్ స్టైల్మీ పిల్లలకు కాటుక పెట్టడం వారి ఆరోగ్యానికి ఎంత డేంజరో తెలుసా..?

మీ పిల్లలకు కాటుక పెట్టడం వారి ఆరోగ్యానికి ఎంత డేంజరో తెలుసా..?

ఇంట్లో చిన్న పిల్లలు ఉన్నారంటే ఆ ఆనందమే వేరు. బయట ఎన్ని టెన్షన్ లు ఉన్నా ఒక్కసారి వారు నవ్వుతున్న మొహాన్ని చూస్తే అన్నీ మాయమైపోతాయి. ఇక ఆ చిన్నారులు అందంగా కనపడాలని, ముద్ధులొలికేలా ఉండాలని ఇంట్లో వాళ్ళు పడే తాపత్రేయం అంత ఇంతా కాదు. పిల్లల స్నానం దగ్గరి నుండి ముస్తాబు వరకు మన అమ్మమ్మలు, నాయనమ్మలు దగ్గరుండి జాగ్రత్తగా చూసుకుంటారు. అలాంటి ముస్తాబులో భాగమే కాటుక దిద్దడం. ఆనాటి నుండి పిల్లలకు నుదుటున, కళ్లకు కాటుక దిద్దడం సర్వసాధారణమే అయినా ఇప్పుడు అందులో కూడా పిల్లలకు ఒక ముప్పు పొంచి ఉందనేది ఆశ్చర్యం కలిగే విషయం.

పిల్లలకు దిష్టి తగలకూడదని కాటుకతో నుదుటన, బుగ్గపైన, అరచేతికి, అరికాలికి బొట్టు పెడుతుంటారు. కళ్లు పెద్దవిగా కనిపించాలని, కనుబొమ్మలు అందంగా కనిపించాలని రకరకాల కారణాలతో కాటుకను వాడుతుంటారు. అయితే మన పెద్ద వాళ్ల ఉద్దేశ్యం మంచిదే అయినప్పటికీ ఇప్పుడు మార్కెట్ లో దొరికే కాటుకలు మాత్రం అందుకు విరుద్ధంగా ఉన్నాయి. ఎంత ఆర్గానిక్, నేచురల్ అని చెప్పినా కూడా వాటిలో కెమికల్ కలయిక వల్ల ఆరోగ్యానికి హాని కలుగుతుంది. ముఖ్యముగా కాటుకలో ఉండే లెడ్ అనే మూలకం వల్ల ఆరోగ్య సమస్యలు ఎదురవుతున్నాయి.

ఇలా మార్కెట్ లో దొరికే కాటుకలను వాడడం వల్ల దీర్ఘ కాలం లో అది పిల్లల శరీరం లో కలిసి పోయి గుండె సమస్యలు, తలనొప్పి వచ్చే అవకాశాలు ఉన్నాయి. ముఖ్యంగా కళ్లకు కాటుక పెట్టడం వల్ల లాక్రిమల్ డక్ట్ మూసుకుపోయి అది పిల్లల కన్నీటిని సమన్వయం చేయడం లో దెబ్బతింటుంది. కాటుకలో కార్బన్ పొడి వల్ల ఈ ఇబ్బంది ఎదురవుతుంది. అందుకే మనం మార్కెట్ లో దొరికే ఎంత మంచి కాటుక అయినా వాడకూడదు. మరి దీని పరిష్కారం ఏమిటి..?

 

కాటుక ను మార్కెట్ లో కొనకుండా.. ఇంట్లోనే తయారు చేసుకోవచ్చు. ఒక ఆముదపు దీపాన్ని వెలిగించి దాని మీద కాస్త ఎత్తులో ఒక స్తాంబాలాన్ని లేదా ఇత్తడి ప్లేట్ ను ఉంచి నుండి వచ్చే మసిని సేకరించి దాన్ని పిల్లల అలంకరణలో ఉపయోగిస్తే… అది వారి అందాన్ని పెంచడం తో పాటు ఆరోగ్యాన్ని కూడా అందిస్తుంది.

RELATED ARTICLES

Latest News

Recent Comments