రేవంత్ రెడ్డి ఆధ్వర్యం లో ఏర్పాటు చేసిన హైడ్రా పై హైకోర్ట్ లో పిటీషన్ దాఖలు అయ్యింది. గత కొద్ది రోజులుగా హైదరాబాద్ లో సంచలనాలకు కేంద్రబిందువుగా, రాష్ట్ర ప్రజల్లో చర్చనీయా అంశంగా మారిన హైడ్రా రద్దుకు పిటీషన్ వేశారు. G.O.99 ని రద్దు చేయాలని, హైడ్రా కమీషనర్ గా రంగనాథ్ నియామకం కూడా సరైనది కాదని పిటీషన్ లో పేర్కొన్నారు. జి .హెచ్.ఎం.సి. అధికారాలను మరొక సంస్థకు బదిలీ చేయడం జి.హెచ్.ఎం.సి. యాక్ట్ ప్రకారం చెల్లదని పిటీషన్ లో పేర్కొన్నారు. ఈ విషయం కౌంటర్ దాఖలు చేయవలసింది గా హై కోర్ట్ ప్రభుత్వాన్ని ఆదేశిస్తూ… విచారణని రెండు వారాలకు వాయిదా వేసింది.
హైడ్రా రద్దు కానుందా..? హైకోర్ట్ లో పిటీషన్…
RELATED ARTICLES