Teluguflynews : గూగుల్.. ఏ సమాచాారం కావాలన్నా ఇచ్చే సెర్చ్ ఇంజిన్. మనోళ్లు ప్రేమగా.. ముద్దుగా గూగుల్ తల్లి అని పిలుస్తారు కదా. ఇప్పుడు అందరి జీవితాల్లో గూగుల్ అన్నింటి కంటే ముఖ్యమైపోయింది. అయితే.. గూగుల్ మీద ఎక్కువ ఆధారపడితే మన మెదడు పని హుష్ కాకి అవుతుందట. మీరు నమ్మినా.. నమ్మకపోయినా ఇదే నిజం. ప్రతిదానికి గూగుల్ మీద ఆధారపడితే ఏమవుతుందో తెలియాలంటే ఈ స్టోరీ చదవండి.
మనకు కావాల్సిన ప్రతి చిన్న విషయాన్నీ మనం గూగుల్ లో వెతకడం అలవాటు చేసుకున్నాం. ఇలా సెర్చ్ చేయడం మొదలుపెట్టాక మనలో చాలా మంది ఒక విషయాన్నీ గుర్తుపెట్టుకోవాలి అనే ఆలోచన వదిలేసి ఏదైనా ఉంటె గూగుల్ లో చూసుకోవచ్చూ కదా.. అని అనుకుంటున్నారు.సరిగ్గా ఇదే అలవాటు మనల్ని డేంజర్లోకి నెట్టేస్తుంది. ఇది నేరుగా మన మెదడు పైన ప్రభావాన్ని చూపుతుంది. దీన్నే గూగుల్ సెర్చ్ ఎఫెక్ట్ లేదా digital amnesia అంటారు. మరి దీని ప్రభావాలు మనపై ఎలా ఉంటాయో చూద్దాం !
గూగుల్ సెర్చ్ వల్ల మన మెదడు పై కలిగే ప్రభావాలు:
- మనం ప్రతి చిన్న విషయాన్ని గూగుల్ లో వెతకడం, అది తెలుసుకుని వదిలేయడం, అవసరమైతే మళ్ళీ చూసుకోవచ్చులే అనే ధోరణి పెరిగి.. మెదడుకు ఒక విషయాన్ని గుర్తుంచుకునే సామర్ధ్యం తగ్గిపోతుంది.
- ఒక విషయాన్ని పూర్తిగా తెలుసుకోవడం మానేసి కేవలం తాత్కాలిక సమాచారాన్ని పొందడం అలవాటుగా మారుతుంది. విషయ అవగాహన శక్తి లేకుండాపోతుంది.
- క్రమంగా మనిషి జ్ఞాపకశక్తి కోల్పోయి అల్జీమర్స్ వచ్చే అవకాశం ఉంది.
- తరచూ స్క్రీన్ చూడటం వల్ల కనుచూపు మీద కూడా ప్రభావం పడి సైట్ వచ్చే అవకాశం ఉంది. తీవ్రత పెరిగితే కంటి నరాలు దెబ్బ తినే అవకాశం ఉంది.
అందువల్ల ప్రతి చిన్న విషయానికి గూగుల్ మీద ఆధారపడకుండా పుస్తకాలు చదివి, ఇతర అనుభవజ్ఞులను అడిగి తెలుసుకుని.. విషయం మీద అవగాహన పెంచుకుంటే అది జ్ఞాపకశక్తిని పెంచడం తో పాటు ఇతర మెదడుకు సంబంధించిన ఆరోగ్య సమస్యలు రాకుండా చేస్తుంది.