TelugunewsFly : జూనియర్ ఎన్టీఆర్, కొరటాల శివ కాంబినేషన్ లో రాబోతున్న సినిమా దేవర. గతంలో వీరిద్దరి కాంబోలో వచ్చిన జనతా గ్యారేజ్ ఏ రేంజ్ లో హిట్టయిందో చెప్పాల్సిన అవసరం లేదు. మోహన్ లాల్, ఎన్టీఆర్ కలిసి జనతా గ్యారేజ్ లో దుమ్ము రేపారు. అప్పట్లో ఆ సినిమా మల్టీస్టార్ సినిమాల్లో ఓ బెంచ్ మార్క్ ని క్రియేట్ చేసింది. చాలా రోజుల తర్వాత మళ్లీ కొరటాల శివ.. ఎన్టీఆర్ ల కాంబినేషన్ లో దేవర రాబోతోంది. ఈ నెల 27 (సెప్టెంబర్ 27)న రిలీజ్ కానున్న దేవర సినిమా టికెట్లు భారీగా పెంచేశారట.
ఇప్పటికే వెయ్యికోట్ల అడ్వాన్స్ బుకింగులు అయిపోయాయట. తాజాగా రెండు తెలుగు రాష్ట్రాల ప్రభుత్వాలు దేవర టికెట్ రేట్లు పెంచుకునేందుకు అనుమతులు ఇచ్చాయి. తెలంగాణలో మల్టీప్లెక్స్ లో రూ.413, సింగిల్ స్క్రీన్ థియేటర్లలో రూ.250కి టికెట్ రేట్లు పెంచారు. ఆంధ్రప్రదేశ్ లో అయితే.. మల్టీప్లెక్స్ లో రూ.325, సింగిల్ స్క్రీన్ థియేటర్లలో రూ.200 గా టికెట్ రేట్లు పెరిగాయి. టీజర్, ట్రైలర్, పాటలు సినిమా మీద అంచనా పెంచిన నేపథ్యంలో నందమూరి అభిమానులు సినిమా మీద భారీగా ఆశలు పెట్టుకున్నారు. మరి సినిమా ఎలా ఉండబోతోందో ఈ నెల 27న తెలిసిపోనుంది.