telugunewsfly : వరుసగా నాలుగు రోజులు సెలవులు కావడంతో హైదరాబాద్ లోని ఖైరతాబాద్ గణేషుడిని దర్శించుకునేందుకు భక్తులు పెద్ద ఎత్తున తరలి వస్తున్నారు. సెప్టెంబర్ 14, 15, 16, 17 తేదీల్లో వరుస సెలవులు కావడంతో గణనాథుడికి సందర్శకుల భారీగా సంఖ్య పెరిగింది. రెండవ శనివారం, ఆదివారం, మిలాద్ ఉన్ నబీ, గణేష్ నిమజ్జనం సెలవుల నేపథ్యంలో ఖైరతాబాద్ గణనాథుడి దగ్గర రద్దీ పెరిగింది.
తరలి వస్తున్న భక్తులతో ఖైరతాబాద్, ట్యాంక్ బండ్ పరిసరాలు భక్త జనసందోహంతో రద్దీగా మారాయి. పోలీసులను భక్తులను దర్శనం అవగానే ముందుకు పంపించేస్తున్నారు. ఖైరతాబాద్ పరిసరాల్లో సీసీ కెమెరాలు ఏర్పాటు చేసి మానిటరింగ్ చేస్తున్నారు. ఆకతాయిల నుంచి మహిళలకు ఇబ్బందులు తలెత్తకుండా ప్రత్యేక షీ టీమ్స్ ఏర్పాటు చేశారు. ట్రాఫిక్ సమస్య తలెత్తకుండా ప్రత్యేక పార్కింగ్ సౌకర్యాలు కల్పించారు.