ఒకప్పుడు ఒక సినిమా బడ్జెట్ వంద కోట్లు అంటేనే ఆశ్చర్యపోయేవాళ్లం. అలాంటిది ఇప్పుడు ఒక హీరో సినిమాకు వంద కోట్లు రెమ్యునరేషన్ తీసుకోవడం ప్యాన్ ఇండియా హీరోలకు కామం అయిపోయింది. మరి ఇప్పుడు ఒక భారీ బడ్జెట్ సినిమాకు అయ్యే ఖర్చు ఒక హీరో రెమ్యూనరేషన్ గా తీసుకుంటున్నాడు అనే వార్త సినిమా సర్కిల్లో హల్చల్ చేస్తుంది.
సినిమా రిలీజ్ అయితే చాలు వెయ్యికోట్ల కలెక్షన్లు కొడుతున్న ప్రభాస్ రెమ్యూనరేషన్ ని కూడా దాటి పోయింది దళపతి విజయ్ రేంజ్. ఆయన రాజకీయాల్లోకి వెళుతున్న కారణంగా ఇక సినిమాలు చేయరని వార్తలు వస్తున్నాయి. ఈ నెపథ్యంలో ఈ హీరో చేయబోయే 69 వ సినిమాకు ఏకంగా 275 కోట్లు రెమ్యూనరేషన్ ఛార్జ్ చేస్తున్నట్టు సమాచారం. ఇదే నిజమైతే ఒక ఇండియన్ హీరో ఇంత రెమ్యూనరేషన్ తీసుకోవడం ఇదే మొదటి సారి అవుతుంది. ఈ సినిమా హెచ్. వినోద్ డైరెక్షన్ లో 2025 అక్టోబర్ లో రానుంది.