బంగారం ధర మళ్ళీ రికార్డు ధరను టచ్ చేస్తుంది. సెంట్రల్ బడ్జెట్ లో గోల్డ్ పైన ఎక్సైజ్ సుంకం తగ్గింపు ప్రకటన రాగానే ధరలు ఒక్కసారిగా పడిపోయాయి. అయితే మళ్ళీ బంగారం పెరుగుదలకు కారణమేంటి…
అగ్ర రాజ్యమైన అమెరికా సెంట్రల్ బ్యాంక్ 2022 తర్వాత మొదటిసారిగా 50 బేసిస్ పాయింట్ల వరకు వడ్డీ రేటును తగ్గించనుందని మార్కెట్ లో అంచనాలు బలంగా ఉన్నాయి. ఈ ప్రభావం గోల్డ్ మీద కూడా ఉండనుంది. అమెరికాలో నవంబర్ నాటికి 2700 డాలర్ల మార్క్ దాటనుందని నిపుణుల అంచనా..
అమెరికాలో గోల్డ్ రేట్ ప్రభావం మన మార్కెట్ పై కూడా ఉంటుంది. దానితో పాటు దీపావళి నాటికి మన మార్కెట్ లో కూడా బంగారానికి డిమాండ్ పెరుగుతుందని అంటున్నారు. ఇదే నిజమైతే తులం 80 వేల రూపాయలు దాటే అవకాశం ఉంది. ఈ సంవత్సరం చివరి మూడు నెలలు గోల్డ్ రేట్, రాకెట్ లా దూసుకుపోతుందని ట్రేడ్ పండితులు చెబుతున్నారు.