Homeన్యూస్తెలంగాణGanesh Laddu : లడ్డూ సొంతం చేసుకున్న ముస్లిం.. కంగ్రాట్స్ చెప్పిన కేటీఆర్

Ganesh Laddu : లడ్డూ సొంతం చేసుకున్న ముస్లిం.. కంగ్రాట్స్ చెప్పిన కేటీఆర్

Telugunewsfly : భారతదేశంలో గణేష్ నవరాత్రి వేడుకలు ఎంత అంగరంగ వైభవంగా జరుగుతాయో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. తొమ్మిదిరోజుల పాటు పూజలు, భజనలు, ఆటపాటలతో కోలాహలంగా ఉంటుంది. నవరాత్రులు గణపతితో పాటు పూజలందుకున్న ఆయన చేతిలోని లడ్డూను సొంతం చేసుకునేందుకు చాలామంది పోటీ పడుతారు. గణేషుడు నిమజ్జనానికి తరలివెళ్లే నాడు ఆయన చేతిలోని లడ్డూను వేలంపాట పాడటం.. ఎక్కువ ధర పాడిన వారు ఆ లడ్డూను సొంతం చేసుకోవడం మనకు తెలిసిందే. అయితే.. వినాయకుడి చేతిలోని లడ్డూను ఎక్కువగా హిందువులే దక్కించుకుంటుంటారు. కానీ.. తెలంగాణలో ఓ ముస్లిం యువకుడు వినాయకుడి లడ్డూను వేలంపాటలో సొంతం చేసుకొని మత సామరస్యం చాటాడు.

Image

కొమురం భీమ్ ఆసిఫాబాద్ జిల్లాలోని భట్ పల్లి గ్రామానికి చెందిన ఆసిఫ్ అనే ముస్లిం యువకుడు వినాయకుడి చేతిలోని లడ్డూను సంతం చేసుకున్నాడు. వేలంపాటలో ఎంతోమంది పోటీ పడగా.. వినాయకుడి మీద భక్తితో, నమ్మకంతో ఆసిఫ్ స్వామి లడ్డూను సొంతం చేసుకునేందుకు వేలంపాటలో పాల్గొన్నాడు. అందరి కంటే ఎక్కువ ధరకు పాడి గణేషుడి లడ్డూను సొంతం చేసుకున్నాడు. హిందూ మతానికి చెందిన దేవుడి లడ్డూను ముస్లిం యువకుడు సొంతం చేసుకోవడంతో తెలంగాణలోని మత సామరస్యం మరోసారి వెల్లివిరిసింది. వేలంపాటలో లడ్డూ సొంతం చేసుకున్న యువకుడికి బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఎక్స్ వేదికగా అభినందనలు తెలిపారు. తెలంగాణ గంగా జమున తెహజీబ్ అనేదానికి నిదర్శనం అని మరోసారి రుజువు చేసినందుకు ధన్యవాదాలు తెలిపారు.

RELATED ARTICLES

Latest News

Recent Comments