Telugunewsfly: హుజూర్ నగర్ ఏరియా హాస్పిటల్ లో నర్సులు దారుణం చేశారు. వారికి తెలిసిన అరకొర వైద్యం చేశారు. ఒక పసికందు ప్రాణాన్ని బలి తీసుకున్నారు.
సూర్యాపేట జిల్లా మఠంపల్లి మండలం గుర్రం పహాడ్ తండ నుండి రేణుకా పురిటి నొప్పులతో హుజూర్ నగర్ ఏరియా హాస్పిటల్లో చేరింది. ఆదివారం ఉదయం వచ్చిన రేణుకను, సోమవారం ఉదయం వరకు డాక్టర్ లేకపోవడంతో ఎవరు పట్టించుకోలేదు.
చివరికి ఆమె భర్త గొడవ చేయడంతో ఇద్దరు నర్స్ లు డెలివరీ చేశారు.అయితే నార్మల్ డెలివరీ చేసే ప్రయత్నంలో బిడ్డ బయటకి రాకపోవడంతో కాలుతో తల్లి పొట్టపై తొక్కారు. దాంతో బిడ్డ పుట్టినప్పటికీ.. పరిస్థితి విషమంగా ఉండడంతో సూర్యాపేట ఏరియా హాస్పిటల్ కు తీసుకెళ్లగా బిడ్డ మృతి చెందింది.