Telugunewsfly: కుమారీ ఆంటీ అంటే తెలుగు రాష్ట్రాల్లో తెలియని వారుండరు అంత ఫేమస్ మరి. రెండు లివర్లు ఎక్స్ట్రా అంటే ఎవ్వరైనా నవ్వుకుని ఆంటీని తలచుకోవాల్సిందే. అంత వైరలైపోయింది ఆ డైలాగ్. ఆ ఫేంతో సీరియల్స్లో కూడా కనిపించి అందరినీ ఆశ్చర్యపరిచింది.కొంత గ్యాప్ తర్వాత మళ్ళీ ఇప్పుడు వార్తల్లోకి వచ్చింది. కానీ ఈ సారి మాత్రం తన వంటతో కాదు, తన మంచితనంతో..
అప్పట్లో రేవంత్ రెడ్డి స్పెషల్ గా అధికారులకు ఆదేశాలు ఇచ్చి కుమారీ ఆంటీ హోటల్ ను తొలగించవద్దని చెప్పారు. ఆ పనితో రేవంత్ రెడ్డి తన ఉదారతను చాటుకుంటే, ఇప్పుడు కుమారీ ఆంటీ అందుకు ప్రతిఫలం చెల్లించింది. తెలంగాణ లో వరద బాధితులకు తన వంతు సహాయంగా 50 వేల రూపాయల సహాయం అందించింది. ఈ మేరకు సిఎం రేవంత్ రెడ్డిను కలిసి చెక్కును అందించింది. ఆమెతో పాటు కుటుంబ సభ్యులు కూడా సీఎం ను కలిశారు.