Telugunewsfly: తిరుమల వేంకటేశ్వరుని దర్శనానికి భక్తులు ఎంతగా తాపత్రపడతారో.. ఆయన ప్రసాదం కోసం కూడా అంతే ఆరాటపడతారు. ముఖ్యంగా తిరుపతి లడ్డు రుచి మరే లడ్డు ప్రసాదానికి ఉండదు అని అందరు భక్తుల అభిప్రాయం. నాస్తికులు అయినా సరే తిరుపతి వెళుతున్నామని చెబితే, మాకు కూడా లడ్డు తీసుకురండి అని చెప్తారు. అంత రుచి, పవిత్రత గల ప్రసాదం అపవిత్రం అవ్వడమంటే అది ఎన్నో కోట్ల భక్తుల నమ్మకానికి ఇబ్బంది కలిగించే విషయమే.
ఈ విషయాన్ని వేరెవరు చెప్పినా అంతగా లెక్క చేయరేమో కానీ స్వయంగా ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి అయిన చంద్రబాబే చెప్పడం ఆశ్చర్యం కల్పిస్తుంది. వై.సి. పి. అధికారంలో ఉన్నపుడు ప్రసాదం తయారీలో నెయ్యిని వాడకుండా, జంతువుల నూనె వాడారని అన్నారు. తిరుమల ప్రసాదం పవిత్రతను చెదగొట్టారని, ఈ విషయ తెలిసి ఆశ్చర్యపోయాను అని చెప్పారు. మళ్లీ ఆ పవిత్రతను తీసుకొస్తామని చెప్పారు.