Telugunewsfly: ఇప్పుడున్న మెకానిక్ లైఫ్ లో పనిచేసి వచ్చి పడుకునేపటికి అర్ధరాత్రి అవుతుంది, పొద్దున్నే లేచేసరికి ఆఫీస్ టైం అవుతుంది. మరి కుర్ర వయసైతే కాలేజ్ బస్సొస్తుంది. ఇక ఎక్సర్సైజ్ కి టైం ఎక్కడిది అంటారా. అందుకే మీ టైమింగ్ తగ్గట్టుగా.. ఓ కిందా మీద పడిపోయి అవసరం లేకుండా ఒక్క ఎక్సర్సైజ్ చేస్తే చాలు. మీ లైఫ్ స్టైల్ కి ఏ మాత్రం డిస్టబెన్స్ లేకుండా బాడీ పర్ఫెక్ట్ షేప్ లోకి వచ్చేస్తుంది.
మీరు ఉదయం, లేదా సాయంత్రం సమయం లో ఒక్క నిమిషం పాటు ప్లాంక్ వేయగలిగితే చాలు, మీ పొట్టలో కొవ్వంతా కరిగిపోతుంది. కొవ్వు కరుగుతుంది అనగానే ఒక నిమిషమేంటీ కనీసం ఓ ఐదు నిమిషాలు టైం ఇద్దాం అనుకుంటున్నారా.. అనుకున్నా ఎంతసేపు ప్లాంక్ వేయలేరు. ఒక్క నిమిషం వేయడానికి ఒక వారం ప్రాక్టీస్ చేయాలి. మరి ఆ ప్లాంక్ ఎలా వేయాలో చూద్దాం.
ముందుగా మీరు మ్యాట్ పై బోర్లా పడుకోండి. అరచేతి నుండి మోచేయి వరకు కింద ఆని ఉండేలా సపోర్ట్ తీసుకుని, కింద వైపు కాలి వేల్ల పై బరువును వుంచి మొత్తం బాడీను పైకి లేపాలి. ఇలా మొదటి రోజు అరనిమిషం పాటు ఉండాలి. అలా రోజూ కొంత టైం పెంచుకుంటూ వెళ్ళండి. మీరు మూడు నిమిషాలు ఉండగల్గుతున్నారు అంటే మీ పొట్ట కరిగిపోయినట్టే. కేవలం పొట్ట కరగడమే కాకుండా బాక్ మజిల్స్ ధృడంగా తయారవుతాయి. బాడీలో కండరాలు అన్నీ బలంగా అయ్యి మంచి ఫిట్ నెస్ వస్తుంది.