Telugunewsfly: ఇంట్లో దేవున్ని అనునిత్యం పూజించినప్పటికీ, దైవాన్ని ప్రాణ ప్రతిష్ట చేసినటువంటి దేవాలయ సందర్శనకు ప్రతి ఒక్కరూ ప్రాధాన్యతనిస్తారు. అలా ఆ పవిత్ర స్వరూపం ఉన్న గర్భాలయానికి ఎంతో పవిత్రత ఉంటుంది. కేవలం పూజారి మాత్రమే లోపలికి ప్రవేశించే అర్హత ఉంటుంది. మరి అటువంటి గర్భ గుడి ఎదురుగా అద్దాన్ని ఏర్పాటు చేయడం మనం చూస్తుంటాం. దానికి గల కారణం మాత్రం చాలా మందికి తెలియదు.
దైవ దర్శనం కోసం మనం పడే తపన అంతా ఇంతా కాదు. అలాంటప్పుడు ఆ దర్శనం లభించకపోతే నిరాశకు లోనవుతాం. దేవుడి కరుణ మనపై లేదని, అపచారం చేశాం అని ఆందోళనకు గురయ్యేవారు కూడా ఎక్కువ సంఖ్యలోనే అంటారు. ఇందుకు పరిష్కారంగా పెట్టిందే అద్దం.
గర్భ గుడికి ఎదురుగా సరిగ్గా దేవుని రూపం కనిపించే విధంగా అద్దాన్ని ఉంచుతారు. దీనివల్ల భక్తుల రద్దీ ఎక్కువగా ఉన్నపుడు ఆ రూపాన్ని నేరుగా సరిగా దర్శించే అవకాశం కలగని వారు నిరాశతో వెణుతిరగకుండా అద్దంలో దేవుని సంపూర్ణ రూపాన్ని దర్శించవచ్చు. కొన్ని శివాలయాల్లో గర్భ గుడి లోపల కూడా లింగం వెనక భాగాన ఎత్తులో అద్దాన్ని అమరుస్తారు. దానితో దూరాన దర్శనం కోసం నిలబడిన వారికి కూడా స్పష్టంగా ఆ విగ్రహం కనపడుతుంది.