Telugunewsfly: చిన్నప్పటి నుండి స్కూల్ లో పాఠాలు చదివి నేర్చుకున్నాం కదా.. ఆరోగ్యాంగా ఉండాలంటే రోజుకు రెండు సార్లు పళ్లను బ్రష్ చేసుకోవాలని. మరి ఆ పనే మనలని డెంజర్ లోకి నెడుతుంది అంటే నమ్ముతారా..? అవును మనం పళ్లు తోమడానికి వాడే టూత్ పేస్ట్ ( tooth paste) ఇందుకు కారణం.
యాడ్స్ లో మనం చూస్తుంటాం కదా.. బ్రష్ నిండా ఒక వేలు మందంతో ఎస్ ఆకారం లో పేస్ట్ ని పెట్టి చూపిస్తుంటారు. ఇది వాడితే పళ్లు నొప్పి రావు, చిగుళ్లు బలంగా తయారవుతాయని, రక్త స్రావం జరగదని.. ఇలా రకరకాలుగా పళ్లకు ఎన్ని రకాల సమస్యలు వస్తాయో అన్నింటిని తగ్గించడానికి తమ పేస్ట్ ఉపయోగపడుతుందని చెపుతుంటారు. ఇక tooth paste తయారీలో వాడే వస్తువుల లిస్ట్ అయితే చెప్పనక్కర్లేదు ఒకడు మా పేస్ట్ లో ఉప్పు ఉందంటే, ఇంకొకడు బొగ్గు ఉందంటాడు, మరొకడు లవంగం అంటాడు.. ఇలా వంట గదిలో ఉండే లిస్ట్ అంతా చదివి వినిపిస్తూ.. అసలు విషయాలు దాచేస్తూ, మనల్ని మాయ చేస్తూ మనకు పేస్ట్ తో పాటు రోగాలు కూడా అంతకడుతున్నారు.
అసలు toothpaste లో వాడే ఇంగ్రిడియంట్స్ ఏంటి..? మనం పేస్ట్ ఎంత మోతాదులో వాడాలి అని పనికొచ్చే నిజాలు మాత్రం యాడ్ లో ఇవ్వకుండా పేస్ట్ ట్యూబ్ పైన చిన్న చిన్న అక్షరాలలో రాసి పెడుతున్నారు. కానీ మనం మాత్రం వాటిని చూడకుండానే పేస్ట్ ను వాడేసి, రోగాలను కొని తెచుకుంటున్నాం. బ్రష్ పైన పేస్ట్ ని ఎస్ ఆకారం లో అలంకరించనక్కర్లేదు, కేవలం పల్లి గింజంత పరిమాణం లో పెట్టుకుంటే చాలు. ఈ విషయం పేస్ట్ తయారీ కంపెనీ వాడే, ఆ పేస్ట్ ట్యూబ్ పైన, దాని ప్యాక్ చేసే డబ్బా పైన జాగ్రత్తగా మనకు కనపడనంత సైజులో ఇస్తాడు. మనం కాస్త ఓపిక చేసుకుని చదివితే కనిపిస్తుంది.
ఇక ఉప్పు, బొగ్గు లాంటి వాటిని గురించి కాసేపు పక్కన పెడితే.. toothpaste తయారీలో వాడే సోడియం లారెల్ సల్ఫేట్, ఫ్లోరైడ్ లాంటి కెమికల్స్ వాడకం వల్ల ఆరోగ్య సమస్యలు ఎదురవుతాయి. నోటి పూత మొదలుకుని క్యాన్సర్ వరకు ఎన్నో రకాల అనారోగ్యాలు.. మనకు రావడానికి మనం వాడే టూత్ పేస్ట్ కూడా కారణమని పరిశోధనలు తెలుపుతున్నాయి. ఫ్లోరైడ్ లాంటి కెమికల్స్ మోతాదుని మించి వాడితే అది ఆరోగ్యానికి తీరని చేటు చేసి ప్రాణాలనే తీస్తుంది. ఎలాగూ మనం పేస్ట్ వాడకం వదులుకోలేము, అంతగా అలవాటుపడిపోయాం.. కాదు అలవాటు చేసారు. కనీసం మోతాదు మించకుండా, అందులో వాడే మూలకాలు ఏంటో చూసి కొనడం, వాడడం అలవాటు చేసుకుంటే హెల్త్ పాడవకుండా ఉంటుంది. అంతే కాకుండా వారానికి ఒకసారి వేప పుల్ల తో పళ్లు తోమడం అలవాటు చేసుకుంటే ఇంకా మంచిది.