గిన్నిస్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డ్స్ లో పేరు నమోదు కావాలంటే పైరవీలు పనికి రావు. మంత్రుల సిఫారసు తో రికార్డులు నమోదు కావు. నిజంగా ప్రపంచ స్థాయిలో ఎవరూ అప్పటి వరకు సాధించని పని చేసి, అది గిన్నిస్ బుక్ వారు ధ్రువీకరణ చేస్తే తప్ప బుక్ లో స్థానం దక్కదు. మరి అలా మన తెలుగు సినీ పరిశ్రమ నుండి guinnes book స్థానం సంపాదించిన తారల వివరాలు తెలుసుకుందాం.
దాసరి నారాయణ రావు:
దర్శక రత్న దాసరి నారాయణరావు అత్యధిక సినిమాలకు దర్శకత్వం వహించిన ఘనత సాధించి guinnes book లో స్థానం సంపాదించారు. ఆయన 150 సినిమాలకు దర్శత్వం వహించారు.
విజయ నిర్మల:
విజయ నిర్మల అనగానే సూపర్ స్టార్ కృష్ణ భార్యగానే అందరికీ గుర్తొస్తుంది. కానీ ఒక దర్శకురాలుగా ఆమెకు ఒక ప్రత్యేకమైన స్థానం ఉంది అనే విషయం ఈ తరానికి చాలా వరకు తెలియదు. ప్రపంచంలోనే అత్యధికంగా 45 సినిమాలకు దర్శకత్వం వహించిన లేడీ డైరెక్టర్ గా ఆమె పేరు guinnes book of world record లొకి ఎక్కింది.
S.P. బాలసుబ్రహ్మణ్యం:
ఒక సింగర్ గా పరిచయం అక్కర్లేని పేరు. 45 వేల పాటలు పాడి guinnes book రికార్డు సాధించాడు. అనితర సాధ్యమైన గాన గంధర్వుడు చిరస్థాయిగా గిన్నిస్ బుక్ లో నిలిచిపోయాడు.
P. సుశీల:
సౌత్ ఇండియాలో లత మంగేష్కర్ కు దీటైన సింగర్ పి. సుశీల. 17 వేలకు పైగా పాటలు పాడిన మహిళా గాయని గా guinnes book records లో ఆమె పేరు నమోదయ్యింది.
Dr.D. రామానాయుడు:
మూవీ మొఘల్ రామానాయుడు అంటే తెలియని వారుండరు. సురేష్ ప్రొడక్షన్స్ నిర్మాణంలో భారతీయ భాషలన్నిటిలో 100 చిత్రాలను నిర్మించి తన పేరును guinnes book records లో లిఖించుకున్నారు.
బ్రహ్మానందం:
బ్రహ్మానందం పేరు చెప్పినా చాలు నవ్వొచ్చేస్తుంది. అంతలా కామెడీని పండించాడు బ్రహ్మి. అత్యధిక సినిమాల్లో నటించిన రికార్డును నవ్విస్తూ.. తన సొంతం చేసుకుని guinnes book లోకి ఎక్కేసాడు.
చిరంజీవి:
Megastar చిరంజీవి అరుదైన ఫీట్ తో guinnes book లోకి ఎంటరయ్యాడు. ఆయన నటించిన 153 సినిమాల్లో పాటలకు 24 వేల స్టెప్పులు వేసి మోస్ట్ ప్రొలిఫిక్ యాక్టర్ గా guinnes book of world records లో తనదైన స్థానాన్ని సంపాదించుకున్నాడు.