అకౌంట్ లో డబ్బులు కట్ అయ్యాయని సడన్ గా ఒక మెసేజ్ వస్తుంది. ఎందుకు కట్ అయ్యాయో తెలియక తికమక పడతాం. వెంటనే బ్యాంక్ కు పరుగు తీస్తాం. అక్కడ వాళ్లు చెప్పే కారణం విని, ఇంటి ఇలా చేశాం అని బాధపడతాం, మన మీద మనమే కోపం తెచ్చుకుంటాం, చిన్న జాగ్రత్త తీసుకుని ఉంటే అయిపోయేది కదా ఎలా మర్చిపోయాం అనుకుంటాం.
టి.వి. కోసమో, ఫ్రిజ్, వాషింగ్ మెషీన్ కోసమో ఇలా ఏదో ఒక వస్తువును కోణాలనుకుంటాం. స్టోర్ వాడు వెంటనే ఈ. ఎం.ఐ ఆప్షన్ ఉందని, ఫైనాన్స్ వస్తుందని బంపర్ ఆఫర్ ఇస్తాడు. అది మనకు ఈజీ ఆప్షన్ లా కనిపిస్తుంది. వెంటనే వాడు అడిగిన ప్రూఫ్ లు ఇస్తాం, చెక్కులు ఇస్తాం, వస్తువు ఇంటికి తెచ్చుకుంటాం. ఇన్స్టాల్మెంట్ లు కూడా కరెక్ట్ గా కట్టేసి లో క్లియర్ చేస్తాం, చేతులు దులుపుకుంటున్నాము. ఇక్కడే అసలు తప్పు చేస్తున్నాము.
లోన్ క్లియర్ అయిన తర్వాత, ప్రైవేట్ ఫైనాన్షియర్ దగ్గర నుండి N.O.C. తీసుకోవడం పట్ల అశ్రద్ధ వహించకుండా, సంబంధిత బ్రాంచ్ కు వెళ్లి, లోన్ అకౌంట్ క్లోజ్ చేయించి, వాళ్లకు చెక్కులు ఏమైనా ఇచ్చి ఉంటే అవి కాన్సల్ చేయాలి. ఇలా చేయకుండా మర్చిపోయినా, బద్ధకించినా.. ఫైనాన్స్ వాడు రెగ్యులర్ గా చేసే మంత్లీ కటింగ్ ప్రాసెస్ చేయడం తో అకౌంట్ లో డబ్బులు కట్ అవుతూనే ఉంటాయి. అందుకే వెంటనే జాగ్రత్త పడండి.