Telugunewsfly: ఉపముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ ఇటీవల రాష్ట్రంలో సృష్టించిన అలజడి అంతా ఇంతా కాదు. ఇక్కడ మొదలుపెడితే పక్క రాష్ట్రమైన తమిళనాడు దాకా అందరిని గెలికి వదేలేసాడు పవన్ కళ్యాణ్. అయితే ఇదేదో ఆవేశంలో ఊగిపోయి చేసిన పనులు కావని, దీని వెనక పెద్ద ప్లానే ఉందని పవన్ మూవ్స్ చూస్తుంటే అర్ధమవుతుంది. అదును చూసి ఏ.పి. లో వేసిన అడుగులే తమిళనాడులో వేస్తున్నట్టు కనపడుతుంది.
పవర్ స్టార్ గ తనకున్న స్టార్ పవర్ ని 2024 ఎన్నికల్లో పర్ఫెక్ట్ గా వాడాడు కళ్యాణ్. చంద్రబాబు అరెస్ట్ తర్వాత తెలుగుదేశం దిక్కు తోచని స్థితిలో ఉన్నప్పుడు నేరుగా జైలులో సి.బి.ఎన్ ను కలిసి, జైలు బయటనే తన మద్దతును ప్రకటించి ఒక్కసారిగా ఏ.పి. పొలిటికల్ ఈక్వేషన్ ను మార్చివేసాడు. ఇక ఎక్కన్నుండి కూటమి ఏర్పాటు, ఎన్నికల వ్యూహం, ఎన్నికల్లో గెలవడం నుండి కేంద్ర ప్రభుత్వానికి మద్దతు తెలపడం వరకు రాజకీయంగా పవన్ చాల కీలకంగా మారాడు. పవన్ వల్లే కూటమి విజయం సాధ్యం అయ్యింది, టి.డి.పి. కష్టాల్లో నుండి బయటపడింది అనే అభిప్రాయానికి సామాన్య ప్రజలు వచ్చేలా చేసాడు. ఇప్పుడు ఇదే వ్యూహాన్ని తమిళనాడులో కూడా అమలు చేసేందుకు సిద్ధమవుతున్నట్టు సంకేతాలు కనిపిస్తున్నాయి.
సనాతన ధర్మం విషయం లో తమిళనాడు డిప్యూటీ సి.ఎం. ని విమర్శించినా పవన్ అక్కడి రాజకీయాలలో కూడా హాట్ టాపిక్ గా మారారు. అక్కడి డి.ఎం.కె. వర్గాల నుండి వ్యతిరేకత వచ్చి అది ప్రాంతీయ విబేధాలుగా మారేలోపు తమిళ ఛానెల్ కు ఇంటర్వ్యూ ఇచ్చి తమిళ్ లో మాట్లాడి అక్కడి వాళ్లను ఆకట్టుకున్నాడు. పవన్ ను ఓన్ చేసుకునేలా చేసాడు. ఇక తనకున్న సినీ గ్లామర్ ఎలాగూ అతనికి కలిసొచ్చింది. అయితే తమిళనాడు లో పాగా వేసేందుకు ఇప్పుడు ఇంకొక అడుగు ముందుకేసాడు పవన్ కళ్యాణ్. జయలలిత మరణం తర్వాత అన్నా డి.ఎం.కె. పరిస్థితి అగమ్యగోచరంగా మారింది. తమిళనాట ఎంతో క్యాడర్ ఉన్నా ఆ పార్టీ సరైన నాయకత్వం లేక ఇబ్బంది పడుతుంది. సరిగ్గా టి.డి.పి. ఎలాంటి పరిస్థితిని ఆంధ్ర లో ఎదురుకుందో అలానే తమిళనాడులో అన్నా డి.ఎం.కె. ఎదురుకుంటుంది. ఇక్కడే పవన్ తన వ్యూహాన్ని అమలు చేసేందుకు సిద్దమవుతున్నాడు.
అన్నా డి.ఎం.కె. 53 వ వార్షికోత్సవం సందర్బంగా ట్వీట్ చేస్తూ పార్టీకి పూర్వ వైభవం రావాలంటూ.. ఎం.జి.ఆర్., జయలలిత లను ప్రస్తావించాడు. పార్టీ లక్ష్యాలు, ఆశయాలను గురించి రాసుకొచ్చాడు. మెల్లగా ఆ పార్టీతో దోస్తీకి సందేశాలు పంపుతున్నాడు. ఒక వైపు ఎప్పటినుండో బి.జె.పి. తమిళనాడులో తన బలాన్ని పెంచుకోవాలని చూస్తుంది. పవన్ ఎలాగూ తన మిత్రుడే. పవన్ బలపడితే బి.జె.పి. బలపడ్డట్టే. సో కళ్యాణ్ కు అటు నుండి మద్దతు లభిస్తుంది. అక్కడ కూడా కష్టాల్లో ఉన్న అన్నా డి.ఎం.కె. తో జత కట్టి ఆ క్యాడర్ ను వాడుకుని తన బలాన్ని పెంచి కూటమి కట్టే ప్రయత్నాలు జరిగే అవకాశాలు పుష్కలంగా ఉన్నాయి. చూడాలి మరి స్టార్ హీరో విజయ్ కూడా రాజకీయంగా యాక్టివ్ అవుతున్న ఈ సమయం లో పవన్ పాచిక పారుతుందా లేదా అని.