Homeన్యూస్తెలంగాణAlwal : నెమ్మదిగా డ్రైవ్ చేయమన్నందుకు వృద్ధుడిపై బైకర్ దాడి.. వృద్ధుడు మృతి

Alwal : నెమ్మదిగా డ్రైవ్ చేయమన్నందుకు వృద్ధుడిపై బైకర్ దాడి.. వృద్ధుడు మృతి

Telugunewsfly: రద్దీగా ఉండే రోడ్డులో వేగంగా డ్రైవ్ చేస్తున్న యువకుడిని వారించినందుకు ఓ వృద్ధుడు ప్రాణాలు కోల్పోయాడు. హైదరాబాద్ లోని అల్వాల్ పరిధిలో రద్దీగా ఉండే ఓ రోడ్డులో ఇద్దరు బైకర్లు వేగంగా డ్రైవ్ చేస్తూ వచ్చారు. జనాలు తిరిగే రోడ్డులో బండి నెమ్మదిగా నడపండి అని సూచించిన వృద్ధుడిపై ఆ బైకర్లు విరుచుకుపడ్డారు.

మాకే అడ్డు వస్తావా అంటూ ఆంజనేయులు అనే 65 ఏళ్ల వృద్ధుడిని చితకబాది అక్కడి నుంచి పరారయ్యారు. ఈ ఘటనలో వృద్ధుడి తలకు బలమైన గాయమైంది. స్థానికులు, కుటుంబసభ్యులు అతడిని ఓ ప్రైవేట్‌ ఆస్పత్రికి తరలించగా, చికిత్స పొందుతూ నిన్న మృతి చెందాడు. పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.

RELATED ARTICLES

Latest News

Recent Comments