Telugunewsfly: రైల్వే సంస్థ రిజర్వేషన్ బుకింగ్ లో మార్పులు తీసుకొచ్చింది. ముఖ్యంగా పండగల వేళ సొంత ఊర్లకు వెళ్లే వారు 4 నెలల ముందుగానే టికెట్లు బుక్ చేసుకోవడం చూస్తుంటాం. అయితే ఈ అవకాశం ఇప్పుడు లేదు. ఇండియన్ రైల్వే నవంబర్ ఒకటి నుండి ticket advance reservation రూల్స్ మార్చేసింది.
ఇప్పటివరకు ఎక్కడికైనా ప్రయాణం చేయాలంటే 120 రోజుల ముందుగానే టికెట్స్ రిజర్వ్ చేసుకునే అవకాశం ఉండేది, కానీ ఇప్పుడు ఆ సమయాన్ని 60 రోజులకు కుందించారు. అంటే 2 నెలల ముందు మాత్రమే ticket Advance reservation చేసుకోవచ్చు. అయితే నవంబర్ 1st వరకు అడ్వాన్స్ బుక్ చేసుకున్న వారికి యధావిధిగా టికెట్స్ ఇష్యూ అవుతాయి. కానీ ఒకటవ తేదీ నుండి మాత్రం కొత్త విధానం అమలులోకి వస్తుంది.