ఎంతటి కఠినమైన కరోడాలు అయినా సరే ఉల్లిగడ్డ కట్ చేస్తే కరిగిపోవాల్సిందే. కంట నీరు పెట్టాల్సిందే. ఉల్లిగడ్డ ఉదయాన్నే ప్రతి ఇంట ఖచ్చితంగా కంటతడి పెట్టిస్తుంది. అంతటి పవర్ ఉల్లిపాయ సొంతం మరి. కంట తడి లేకుండా ఉల్లిని కట్ చేస్తా అని ఛాలెంజ్ చేసి ఓడిపోయినవాళ్లే కానీ గెలిచినా వారు లేరు. అవును మరి ఏం చేస్తాం అప్రయత్నాంగానే కంట నీరు వచ్చేస్తుంది. కానీ పాపం ఇందుకు ఉల్లిని మనం అపార్థం చేసుకోనక్కర్లేదు, అది మనల్ని ఏడిపించడానికి వెనక ఒక సైంటిఫిక్ రీజన్ ఉంది.
ఉల్లిపాయ కోసినప్పుడు అందులో నుండి ప్రొపనేతియల్ ఎస్ ఆక్సైడ్ ( propanethial s oxide) అనే కెమికల్ రిలీజ్ అవుతుంది. దానికి మన కళ్ళు రియాక్ట్ అయ్యి కన్నీళ్లు వస్తాయి. ఇది సహజంగా జరిగే చర్య కాబట్టి దీన్ని ఎవరు ప్రయత్నపూర్వకంగా ఆపలేరు. అయితే ఉల్లిపాయలను నీళ్లలోనే ఉంచి కట్ చేస్తే ఈ కెమికల్ రియాక్షన్ జరగకుండా ఉండి, మనకు కన్నీరు రాకుండా ఉంటుంది. ఈ విషయం తెలియక చాల మంది కేవలం ఉల్లిగడ్డలను కడిగి కొస్తే కళ్ళు మంట రాకుండా ఉంటాయి అనుకుని పొరపాటు చేస్తారు. నీళ్లలో కడగడం కాదు, నీళ్లలోనే ఉంచి కోయాలి అప్పుడే రియాక్షన్ జరగకుండా ఉంటుంది.