telugunewsfly:హైడ్రా పేరు హైదరాబాద్ హడలెత్తిపోతుంది. ఎప్పుడు ఎవరి బిల్డింగ్ లు కూలగొడతారో అని చెరువుల దగ్గర ఉన్న కాలనీల ప్రజలు నిద్రలేని రాత్రులు గడుపుతున్నాము అని సోషల్ మీడియాలో, న్యూస్ చానెల్స్ లో చెప్పడం చూస్తూనే ఉన్నాము. అయితే ప్రజా వ్యతిరేకత ఎదురవుతుండడం, కోర్టు నుండి అక్షింతలు పడడం తో హైడ్రా కాస్త స్పీడ్ తగ్గించింది. అటు రంగనాథ్ ను కూడా పర్సనల్ గా టార్గెట్ చేస్తుండడంతో దూకుడు తగ్గించాడు. అయితే మళ్లీ ఇప్పుడు సంచలన నిర్ణయం తీసుకుంది హైడ్రా..
హైడ్రా ఇప్పుడు హైదరాబాద్ ట్రాఫిక్ విభాగం తో కలిసి పనిచేయనుంది. ట్రాఫిక్ సమస్యలకు చెక్ పెట్టడానికి ఫుట్ పాత్ మీద ఉన్న ఆక్రమణలను తొలిగించే పని మొదలుపెట్టనుంది. కానీ ఫుట్ పాత్ మీద ఉండే వారంతా చిరు వ్యాపారులే. రోజు వారీ సంపాదన మీద కాలం వెల్లతీసేవారే. మరి వీరిని నిర్ధాక్ష్యణంగా ఖాళీ చేయించి వదిలేస్తుందా. ప్రత్యామ్నాయ మార్గాలు చూపిస్తుందా అనేది చూడాలి.