Telugunewsfly: Pregnant గా ఉన్న మహిళలు సాధారణంగానే ఆరోగ్యం పట్ల చాలా జాగ్రత్తగా ఉంటారు. చిన్న health ఇష్యూ వచ్చినా కూడా వెంటనే డాక్టర్ ను సంప్రదిస్తారు. అలాంటిది ఇప్పుడు అంతటా వైరల్ ఫీవర్ ల సీజన్ నడుస్తుంది. ఎవరిని కదిలించినా కూడా జ్వరాలు, నొప్పులు అంటున్నారు. అందులోనూ చికున్ గున్యా, డెంగీ లాంటి ఫీవర్లు అధికంగా ఇబ్బంది పెడుతున్నాయి. మరి ప్రెగ్నెంట్ గా ఉన్న వారికి ఈ వైరల్ ఫీవర్ వచ్చినట్లయితే.. అది వారిని ఇబ్బందికి గురి చేసే అవకాశాలు ఎక్కువేనట.
ముఖ్యంగా dengue జ్వరం వచ్చిన ఆడవారు ప్రెగ్నెన్సీతో ఉంటే వెంటనే హాస్పిటల్లో అడ్మిట్ అవ్వాల్సి ఉంటుంది. ఎందుకంటే డెంగీ వైరస్ వీరిలో సివియర్ డెంగీ గా మారే అవకాశం ఎక్కువగా ఉంటుంది. డెంగీ వల్ల ఆర్గాన్ ఫెయిల్యూర్ రిస్క్ గర్భిణీ స్త్రీ లలో ఎక్కువగా ఉంటుంది. కడుపులో ఉన్న బిడ్డకు కూడా ఇది సోకే అవకాశం ఉంటుంది. దీనివల్ల అబార్షన్ కావచ్చు.
ముఖ్యంగా డెంగీకి యాంటి బయాటిక్స్ పనిచేయవు. కేవలం సపోర్టీవ్ మెడిసిన్స్ ఇస్తూ బాడీని హైడ్రేటెడ్ గా ఉంచుతూ ట్రీట్మెంట్ చేస్తారు. అందువల్ల pregnant women తమ పరిసర ప్రాంతాలు శుభ్రంగా ఉండేలా చూసుకుంటూ..దోమలు లేకుండా చూసుకోవాలి. డెంగీ సోకకుండా ముందస్తు జాగ్రత్తలు తీసుకుంటే మంచిది.