Telugunewsfly: జాన్వీ కపూర్ ను జాన్వీ పాప అని ముద్దుగా పిలుచుకుంటున్నారు తెలుగు ప్రేక్షకులు. మన శ్రీదేవి కుతురే కదా అని అలా ఓన్ చేసేసుకున్నారు టాలీవుడ్ ఆడియన్స్. కానీ దేవర తర్వాత జాన్వీ ఫ్యాన్స్ మాత్రం కొంత డిసప్పాయింట్ అవుతున్నారు. ఏంటి మా హీరోయిన్ కు ఇలా జరిగింది అనుకుంటున్నారు.
తెలుగు జనాలు మన జాన్వీ అనుకున్నంతగా.. టాలీవుడ్ డైరెక్టర్స్, ప్రొడ్యూసర్స్ అనుకున్నట్టుగా లేదు. అవును మరి దేవర లాంటి ప్యాన్ ఇండియా మూవీ తర్వాత, అదీ ఆమెకు చుట్టమల్లే సాంగ్ కు వచ్చిన బజ్ తర్వాత.. ఇక tollywood లో jahnvi kapoor వరుస ఆఫర్లతో శ్రీదేవి రేంజ్ లో ఏలేస్తుంది అనుకున్నారు. కానీ సీన్ చూస్తే అలా కనిపించట్లేదు. ఒక్క రామ్చరణ్ సినిమా తప్ప మరో మూవీ స్టార్ట్ అవ్వలేదు.
ఏ బ్యాక్ గ్రౌండ్ లేకున్నా జస్ట్ ఒక్క మూవీ హిట్ తో రష్మిక మందన అప్పట్లో వరుస ఆఫర్లు కొట్టింది. ఇక శ్రీ లీల గురించైతే చెప్పక్కర్లేదు. ఒక స్టేజ్ లో శ్రీ లీల లేని సినిమా లేదు అన్నట్టుగా మారింది సిట్యువేషన్. జాన్వీ కూడా అలానే క్రేజీ ఆఫర్స్ తో దూసుకుపోతుంది ఎక్స్ పెక్ట్ చేశారు కానీ కట్ చేస్తే క్రేజ్ వచ్చింది తప్పా ఛాన్సులు రాలేదు. మరి జాన్వీ పాప టాలీవుడ్ లో అవకాశాలు వద్దనుకుంటుందా.. టాలీవుడే జాన్వీ మనకెందుకు అనుకుంటుందా. ఏమో మరి వచ్చిన ఛాన్సులు వదులుకునేంత స్టారిజం కూడా బాలీవుడ్ లో ఏమీ లేనట్టుంది. మరి పాపకు ఎందుకు ఇలా జరుగుతుంది.