Telugunewsfly: హైదరాబాద్ లో చిరుత సంచారం కలకలం రేపింది. చిరుతను చూసిన స్థానికులు భయభ్రాంతులకు గురయ్యారు. శుక్రవారం రాత్రి మియాపూర్ మెట్రో స్టేషన్ సమీపంలో చిరుత పులి సంచరిస్తుండగా కొందరు దాన్ని వీడియో తీసి సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు. ఆ సమాచారం మెట్రో, పోలీస్ అధికారులకు చేరడంతో వారు ప్రజలను అప్రమత్తం చేశారు.
ఇప్పటికే చిరుతను పట్టుకునేందుకు అటవీ శాఖ అధికారులు రంగంలోకి దిగారని.. ప్రజలు అప్రమత్తంగా ఉండాలని అధికారులు సూచించారు. ఎవరైనా చిరుతను చూస్తే వెంటనే సమాచారం అందించాలని ప్రజలకు సూచించారు పోలీసులు. ఇప్పటికే స్థానికుల సాయంతో అధికారులు చిరుతను పట్టుకునేందుకు ప్రయత్నిస్తున్నారు. అయితే వీడియోలో ఒకే చిరుత కనిపిస్తున్నదని.. మియాపూర్ అటవీ ప్రాంతంలో మరిన్ని చిరుతలు ఉండే అవకాశం ఉందని స్థానికులు ఆందోళన చెందుతున్నా
రు.