మన దేశంలో DDL, sholay లాంటి సినిమాలు అత్యధిక రోజులు, దాదాపు కొన్ని సంవత్సరాలు ప్రదర్శించబడ్డాయి. మన సినిమాలు, మన దేశం లో ఆడటం పెద్ద వింతగా అనిపించకపోవచ్చు. కానీ ఇండియన్ సినిమా జపాన్ లో 91 వారాలుగా ప్రదర్శితమవడం అంటే మామూలు విషయం కాదు.
Takarazuka అనే 110 సంవత్సరాల చరత్ర ఉన్న జపనీస్ థియేటర్ లో మన దేశపు సినిమా అందులోనూ మన తెలుగు సినిమా 1సంవత్సరం 9 నెలలుగా స్క్రీనింగ్ అవుతుంది. అది మరేదో సినిమా కాదు మనందరికీ తెలిసిన బ్లాక్ బస్టర్ RRR. అవును ఈ సినిమాను ఇప్పటికీ జపాన్ లో 14 లక్షల మంది చూశారట. 120 కోట్ల కలెక్షన్లు సాధించిందట. ఇక ఈ రికార్డును కొట్టాలంటే మళ్ళీ రాజమౌళి, మహేష్ కాంబినేషన్ లో ప్యాన్ వరల్డ్ సినిమా రావాల్సిందేనేమో..