Telugunewsfly: వేంకటేశ్వర స్వామి మన అందరి ఇలవేల్పు. ఒక్కసారి ఆయన కటాక్షం కలిగితే కష్టాలన్నీ గట్టెక్కుతాయి. ఆ వేంకటేశుని మనం ఎంత భక్తి, శ్రద్ధలతో పూజిస్తే ఆయన మన కోరికలు నెరవేరుస్తారు. ఆయనకు ఇష్టమైన దీపం తో శనివారం నాడు స్వామి వారిని పూజించి, శ్రీనివాసుడికి ప్రీతి పాత్రులుగా మారొచ్చు.
ముఖ్యంగా స్వామి వారికి పిండి దీపాన్ని వెలిగించి పూజ చేస్తే ఆయన త్వరగా ప్రసన్నుడవుతాడట. బియ్యపు పిండి అరటి పండు కలిపి దీపపు ప్రమిదలు తయారు చేసుకోవాలి. ఏడు వత్తులు కలిపి ఒక వత్తిగా చేసి పెట్టుకోవాలి. ఆవు నెయ్యి లేదా నువ్వుల నూనె తో దీపాలను వెలిగించాలి. ఇలా ప్రతివారం ఏడు పిండి ప్రమిదలతో, ఏడు వారాలు దీపం వెలిగిస్తే మీరు కోరికలు నెరవేరి, కష్టాలు తీరుతాయి. ఇక దీపారాధన తర్వాత పిండి ప్రమిదలను నీళ్ళలో కలిపి ఆ నీటిని మొక్కలు పొసెయ్యాలి.