వారం: శనివారం 19.10.2024, తిథి : విదియ,
నక్షత్రం: భరణి, మాసం : ఆశ్వయుజము ,
సంవత్సరం: శ్రీ క్రోధి నామ, ఆయనం: దక్షిణాయనం
మేషరాశి
గ్రహాలు అనుకూలంగా సంచరిస్తున్నాయి. ప్రయత్నాలు ఫలిస్తాయి. దుర్గాదేవిని ఆరాధిస్తే పనులు నెరవేరుతాయి. ఆదాయాలు, ఆరోగ్యం బాగుంటాయి. వృత్తి, ఉద్యోగాల్లో అభివృద్ధి ఉంటుంది. లావాదేవీలకు అనుకూలం. ధార్మిక కార్యక్రమాల్లో పాల్గొంటారు.
వృషభరాశి
కుటుంబ విషయాలలో మొండితనం, వాగ్వాదం వద్దు. వృత్తి, ఉద్యోగాల్లో మొక్కుబడిగా పని చేస్తారు. సంతానం వల్ల సంతోషం కలిగించే వార్త వింటారు. స్నేహాన్ని విస్తరించుకుంటారు. అపరిచితులకు దూరంగా ఉండటం మంచిది.
మిథున రాశి
ముఖ్యమయిన పనులు పూర్తవుతాయి. ప్రయాణాల్లో జాగ్రత్త పాటించండి. వృత్తి, ఉద్యోగాల్లో స్వధర్మాన్ని నిర్వర్తించండి. విద్యార్థులకు అనుకూల వాతావరణం ఉంది.
కర్కాటక రాశి
ఈరోజు గ్రహసంచారాలు మిశ్రమం. కుటుంబంలో గౌరవ మర్యాదలు పెరుగుతాయి. తప్పనిసరి పరిస్థితుల్లో ప్రయాణాలు చేయవలసి వస్తుంది. ఆధ్యాత్మికతకు ఎక్కువ సమయం కేటాయిస్తారు. పురాణ పఠనం, జ్ణాన గోష్టి చేస్తారు.
సింహం
శ్రమకు తగిన ప్రయోజనాలు అందవు. ఆర్థికపరంగా అభివృద్ధి ఉంటుంది. బంధువులు సహాయం చేస్తారు. వ్యక్తిగత, కుటుంబ విషయాలు రహస్యంగా ఉంచుకోవాలి. ఆచారాలు సంప్రదాయాలు పాటించాలి.
కన్య
మానసికంగా కాస్త అధైర్యపడవద్దు. చేయాలనుకున్న పనులను పూర్తిచేస్తారు. కుటుంబ సభ్యుల సహకారాలు ఉంటాయి. కొత్తవారితో పరిచయాలు ఏర్పడతాయి. వృత్తి, వ్యాపారాల్లో చెల్లింపులు పూర్తి చేసుకునేలా ఆదాయం వస్తుంది. కొనునట్లు ఆదాయాలుంటాయి.
తుల
నూతన వస్తువులు, బహుమతులు కొంటారు. వృత్తి, ఉద్యోగ, వ్యాపారాల్లో ఉత్సాహకర వాతావరణం ఉంటుంది. ఆరోగ్యపరంగా జాగ్రత్తలు తీసుకోవాలి. గృహంలో బంధు మిత్రుల సందడి ఉంది
వృశ్చికం
గ్రహసంచారం అనుకూలంగా లేదు. వాహనం నడిపేటప్పుడు జాగ్రత్త పాటించండి. ప్రయాణ విరమణ సూచనలు ఉన్నాయి. మేధావులతో పరిచయం ఏర్పడుతుంది. కోర్టు వ్యవహారాలు అనుకూలిస్తాయి. తీర్థయాత్రలు, దైవ దర్శనాలు చేసుకుంటారు.
ధనుస్సు
వృత్తి, ఉద్యోగాల్లో అభివృద్ధి ఉంటుంది. విద్యార్థులకు, నిరుద్యోగులకు మంచి సమయం. కుటుంబంలో మిశ్రమ వాతావరణం ఉంటుంది. అధికారులు ప్రశంసిస్తారు. అవసరాలకు అనుగుణంగా ఆదాయం సమకూరుతుంది. అవకాశాలు కలిసివస్తాయి.
మకరం
ప్రయత్న కార్యాలు ఉత్సాహంగా పూర్తిచేస్తారు. మానసికంగా దృఢంగా ఉంటారు. ఇష్టమైన వారితో ముఖ్యమైన విషయాలు ప్రస్తావిస్తారు. కుటుంబంలో స్త్రీల విషయంలో ఖర్చులు పెరుగుతాయి.
కుంభం
ప్రశాంతతకు ప్రాధాన్యత ఇస్తారు. ఖర్చుల విషయంలో వెనకడుగు వేయరు. తల్లిదండ్రుల ఆరోగ్య విషయంలో జాగ్రత్తలు తీసుకోవాలి. వృత్తిలో సంతృప్తికరంగా ఉంటుంది. ఆర్థిక విషయాలలో జాగ్రత్తలు తీసుకోవాలి
మీనం
గ్రహాలు అనుకూలంగా సంచారిస్తున్నాయి. పరిస్థితులకు అనుగుణంగా నిర్ణయాలు తీసుకుంటారు. కొన్ని పనులను వాయిదా వేసుకుంటారు. తల్లిదండ్రుల ఆరోగ్యం సంతృప్తికరంగా ఉంటుంది. ఆస్తి విషయంలో తీసుకున్న నిర్ణయం ఫలిస్తుంది.