- Telugunewsfly: ఇంటి నుండి బయటకు ఏ టైం కు బయలుదేరతాము అనేది చెప్పొచ్చు కానీ తిరిగొచ్చే టైం మాత్రం చెప్పలేము. దీనికి మెయిన్ రీజన్ ట్రాఫిక్. ఎక్కడిక్కడ ట్రాఫిక్ సిగ్నల్స్ పెట్టి, ఒక్కో చోట గ్రీన్ లైట్ పడటానికి దాదాపు 140 సెకన్స్ టైం గ్యాప్ పెట్టి మరీ ట్రాఫిక్ ను మేనేజ్ చేసినా కూడా ట్రాఫిక్ జామ్ అవుతూనే ఉంటుంది. ఇంత వ్యవస్థ పెట్టుకుని కూడా ట్రాఫిక్ ను కంట్రోల్ చేయడం కష్టమవుతుంటే.. అసలు ట్రాఫిక్ లైట్స్ అనేవే లేకుండా ఒక దేశం ఉందంటే కాస్త ఆశ్చర్యమే.
మంచు కొండల మధ్య ఉన్న దేశం భూటాన్. ఈ దేశం లో ట్రాఫిక్ సిగ్నల్స్ అసలు ఉండవు. ఆ దేశపు రాజధాని నగరం లో అయినా, రద్దీ ఎక్కువ ఉన్న ప్రదేశాలైనా అక్కడ జంక్షంలో పోలీసులే ఉండి ట్రాఫిక్ ను కంట్రోల్ చేస్తారు. ఈ వ్యవస్థను చూడటానికి అక్కడి పోలీసులు తమ చేతులతో సంజ్ఞలను చూడటానికి టూరిస్టులు కూడా వస్తుంటారట.