ఈనాటి రాశి ఫలాలు 02.03.2025
మేష రాశి
వృత్తి వ్యాపారాలలో ధైర్యం , ఆత్మస్థైర్యం ప్రదర్శించి లాభపడుతారు. కొత్త వ్యాపారాలకు శుభ సమయం. ఉద్యోగ విషయాలు ఆశాజనకంగా ఉంటాయి. వైవాహిక జీవనం ఆనందంగా ఉంటుంది.
వృషభ రాశి
ఉద్యోగ అవకాశాలు మెరుగవుతాయి. పోటీపరీక్షల్లో రాణిస్తారు. ఉన్నత ఉద్యోగ ప్రాప్తికి అవకాశం. శుభ ఘడియలు ఉన్నాయి.
మిథున రాశి
చట్టపరమైన సమస్యలు తలెత్తే అవకాశం. ఆరోగ్యపరంగా జాగ్రత్తలు తీసుకోవాలి. ఊహించని ఖర్చులు, నష్టాలు తప్పవు.
కర్కాటక రాశి
వ్యయరాశిలో కుజ వక్రం ముగిసింది. నేటి నుంచి శుభఫలితాలు, ఆరోగ్యం, ఆదాయ వనరులు పురోగతి. మీరు సన్నిహితు వల్ౠలాభం పొందుతారు. రియల్ ఎస్టేట్ వ్యాపారులకు మంచి సమయం.
సింహ రాశి
జీవితభాగస్వామి, పిల్లలతో సమయాన్ని గడుపుతారు. కొత్తవారితో పరిచయాలు ఏర్పడతాయి. ఉల్లాసంగా ఉత్సాహంగా రోజు గడిచిపోతుంది.
కన్య రాశి
ఉద్యోగంలో వికాసం, ఉన్నతి కలుగవచ్చు. వృత్తివ్యాపారాల్లో ఇతరులపై ఆధిపత్యం ప్రదర్శి స్తారు. ఆదాయం వచ్చే అవకాశం ఉంది.
తులా రాశి
మిత్రులు, బంధువులతో వివాదాలు ఏర్పడే అవకాశం.. ఆరోగ్యం విషయంలో జాగ్రత్త వహించాలి. వైద్య సహాయం అవసరమవుతుంది. ధనానికి లోటుండదు.
వృశ్చిక రాశి
వ్యవసాయం ద్వారా ఆదాయ సూచితం. కొత్త పెట్టుబడులకు ఉత్సాహం చూపిస్తారు. సంతాన యోగం ఉంది.
ధనుస్సు రాశి
కుటుంబసభ్యులు, బంధుమిత్రులతో సరదాగా గడుపుతారు. మీ పిల్లలు విద్యలలో రాణిస్తారు.మీ మీ రంగాల్లో అభివృద్ధి సాధిస్తారు. ఆదాయం వచ్చే అవకాశం ఉంది.
మకర రాశి
విద్యార్థులు పోటీల్లో, చర్చావేదికల్లో రాణిస్తారు. వ్యక్తిగతంగా మంచి పేరు తెచ్చుకుంటారు. ఉద్యోగ నియామకపు పరీక్షల్లో నెగ్గుతారు.
కుంభ రాశి
వృత్తివ్యాపారాల్లో ఊహించని అవకాశాలు, లాభాలు వస్తాయి. ఆర్థికస్థితి వృద్ధి చెందుతుంది. ఆరోగ్యం అనుకూలంగా ఉంటుంది. దూరప్రయాణాలు కలసి వస్తాయి.
మీన రాశిసో
దరులు, స్నేహితులు మీ బలానికి తోడవుతారు. మీలోని సృజనాత్మక శక్తిని బయటకు తీస్తారు. పాలు మార్గాల్లో ఆదాయం వచ్చే అవకాశం. ఆరోగ్యం బాగుంటుంది. ఊహించని లాభాలు వస్తాయి.