Telugunewsfly.com : ఎస్ఎల్బీసీ సొరంగంల చిక్కుకున్న 8మంది కార్మికులను వెలికి తీసేందుకు తొమ్మిదోరోజు సైతం సహాయకచర్యలుకొనసాగుతూనే ఉన్నాయి. ఇప్పటికే సొరంగంలో కార్మికులు చనిపోయి ఉంటారని మంత్రులు.. ఎమ్మెల్యేలు కామెంట్లు చేస్తున్నారు. సహాయక చర్యల్లో పాల్గొంటున్న అధికారులు, రెస్క్యూ టీమ్ సైతం కార్మికులను ప్రాణాలతో బయటకు తీసుకురావడం కష్టమే అని చెప్తున్నారు.
కాగా.. 15 అడుగుల మేర పేరుకుపోయిన బురదలో కార్మికులు కూరుకుపోయారని.. బురద తొలగించినా కొద్ది మళ్లీ మళ్లీ నీరు ఊరడం, బురద పేరుకుపోవడం వల్ల కార్మికుల మృతదేహాలను వెలికి తీయడం కష్టమైతున్నది.
కాగా.. నలుగురు మృతదేహాలను బురదలో.. టీబీఎం కింద నలుగురు మృతదేహాలను రెస్క్యూ బృందం గుర్తించింది. ఏడు మీటలర్ల లోతులో కూరుకుపోయిన నలుగురు కార్మికుల మృతదేహాలను ఈరోజు సాయంత్రం కల్లా బయటకు తీస్తామని ప్రభుత్వం ప్రకటించింది. ఘటనా స్థలంలో 8 అంబులెన్సులు సిద్ధంగా ఉంచారు. మృతదేహాలకు నాగర్ కర్నూల్ జిల్లా దవాఖానాలో పోస్టుమార్టం నిర్వహించి వారి స్వస్థలాలకు పంపేందుకు అధికారులు ఏర్పాట్లు చేస్తున్నారు.
కాగా.. కార్మికులు టన్నెల్‌లో చిక్కుకుపోయి 9 రోజులు కావొస్తుండటంతో ప్రాణాలతో కాదు కదా.. కనీసం మృతదేహాలనైనా చూస్తామా అని కార్మికుల కుటుంబ సభ్యులు కన్నీరు నిండిన కళ్లతో ఎదురు చూస్తున్నారు. ఈరోజు సాయంత్రం కల్లా నలుగురి మృతదేహాలను.. రేపటి సాయంత్రం కల్లా టీబీఎం కింద చిక్కుకున్న నలుగురి మృతదేహాలను తీసుకొచ్చేందుకు అధికారులు ప్రయత్నిస్తున్నారు.