Homeసినిమాసినిమా అప్డేట్ అడిగితే.. కర్రతో బెదిరించిన రాజమౌళి

సినిమా అప్డేట్ అడిగితే.. కర్రతో బెదిరించిన రాజమౌళి

రాజమౌళి.. మహేశ్ బాబుల కాంబినేషన్ లో వస్తున్న సినిమా కోసం అందరూ ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నరనే విషయం తెలిసిందే. RRR తర్వాత రాజమౌళి.. సర్కారు వారి పాట సినిమా తర్వాత మహేశ్ బాబు సినిమా కావడంతో సినిమా మీద మామూలుగానే భారీ అంచనాలు ఉన్నాయి. అయితే.. సినిమాలో మహేశ్ బాబు లుక్ ఎలా ఉంటుందో ఇప్పటికే తెలిసిపోయింది. కానీ.. సినిమా షూటింగ్ ఎప్పుడు స్టార్ట్ అవుతుందో మాత్రం ఇప్పటికీ ఎలాంటి సమాచారం బయటకు రాలేదు. అయితే.. ఇదే విషయం అడిగినందుకు దర్శకుడు రాజమౌళి ఏకంగా కర్రెత్తుకొని వచ్చారు.

2019లో వచ్చిన మత్తు వదలరా మూవీ ఎంతగా అలరించిందో మనకు తెలిసిందే. ఈ సినిమాకు సీక్వెల్ గా మత్తు వదలరా 2 రాబోతోంది. ఈ సినిమా ప్రమోషన్ లో భాగంగా శ్రీసింహా, కాలభైరవలు కలిసి రాజమౌళి ఇంటికి వెళ్లారు. రేపు (సెప్టెంబర్ 13న) విడుదల కానుంది. సినిమా ప్రమోషన్ గురించి శ్రీసింహా, కాలభైరవ మధ్య బాహుబలి ప్రమోషన్స్ గురించి వాదులాట జరుగుతుంది. మధ్యలో ఏకంగా రాజమౌళి వచ్చి ఇక్కడ గోలేంటి? వెళ్లి పని చూసుకోండి అంటూ కోప్పడుతారు.

Mathu vadalara movie poster

సార్.. మహేశ్ బాబు సినిమా అప్డేట్ ఎప్పుడు అని శ్రీసింహా, కాలభైరవ అడిగితే.. పక్కనే ఉన్న పెద్ద కర్ర తీసుకొని రాజమౌళి వారిని బెదిరిస్తారు ఈ వీడియోలో. ఈ సరదా వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. సెప్టెంబర్ 13న విడుదల కానున్న మత్తు వదలరా 2 మూవీలో శ్రీసింహా, సత్య, ఫరియా అబ్ధుల్లా ప్రధాన పాత్రల్లో నటించారు.

RELATED ARTICLES

Latest News

Recent Comments