Homeసినిమాదేవరను వెంటాడుతున్న బ్యాడ్ సెంటిమెంట్స్

దేవరను వెంటాడుతున్న బ్యాడ్ సెంటిమెంట్స్

జూనియర్ ఎన్టీఆర్, కొరటాల శివ కాంబినేషన్ లో వస్తున్న చిత్రం దేవర. ఇప్పటికే ఈ సినిమా మీద ఎన్నో అంచనాలు ఉన్నాయి. ముఖ్యంగా తారక్ అభిమానులు అతని సినిమా కోసం రెండు సంవత్సరాల నుండి ఎదురుచూస్తున్నారు. ఇప్పటికే కొరటాల, ఎన్టీఆర్ కాంబినేషన్ లో వచ్చిన జనతా గారేజ్ పెద్ద హిట్ కావడం తో దేవర మీద అటు అభిమానులు, ఇటు తెలుగు ప్రేక్షకుల అంచనాలు తారాస్థాయి లో ఉన్నాయి.

అయితే ఇన్ని అంచనాల మధ్య వస్తున్న దేవరను కొన్ని బ్యాడ్ సెంటిమెంట్స్ వెంటాడుతున్నాయి. ముఖ్యంగా సినిమా ఇండస్ట్రీ అంటేనే సెంటిమెంట్లకు పెట్టింది పేరు. ఈ సెంటిమెంట్ల పేరుతో ఎంతో మంది హీరోయిన్లు అవకాశాలు కోల్పోయి కెరీర్ ముంగించారు. ముహూర్తం షాట్ కి ముందు కొబ్బరికాయ కొట్టిన దగ్గరి నుండి, రిలీజ్ డేట్ వరకు ప్రతీది శుభముహూర్తాలు, పాత ట్రాక్ రికార్డులు చూసుకుంటారు మేకర్స్. ఇక అభిమానులు వేసుకునే లెక్కలకు, వారి జ్యోష్యాలు అంతే ఉండదు.మా హీరో హిట్టు సినిమా ఫలానా తేదీలో రిలీజ్ అయింది, ఈ మూవీ కూడా అదే తేదికి వస్తుంది ఇక హిట్టు కన్ఫర్మ్ అని, డైరెక్టర్ కాంబినేషన్ అని, హీరోయిన్ కాంబినేషన్ అని ఇలా చాల లెక్కలుంటాయి. ఇప్పుడు అలాంటి కాకి లెక్కల సెంటిమెంట్ దేవరను కూడా భయపెడుతుంది.

మొదటి సెంటిమెంట్ రాజమౌళి. ఈ పాన్ ఇండియా డైరెక్టర్ మొదటి సినిమా నుండి అందరి హీరోలకు హిట్టును గిఫ్ట్ గా ఇచ్చినా…. ఆ గిఫ్ట్ అందుకున్న హీరోలకు మాత్రం జక్కన్న తర్వాతి చిత్రం ఒక గండంగా మారి ఫ్లాప్ వచ్చి పడుతుంది. ఈ ఖాతాలో జూనియర్ సింహాద్రి, యమదొంగ సినిమాల తర్వాత ఫ్లాప్ లతో రెండు సార్లు బలయ్యాడు. ఇక ఇది మూడో ప్రయత్నం. ఎన్టీఆర్ చివరిగా చేసిన మూవీ ఆర్.ఆర్.ఆర్. ఆల్రెడీ అందరూ అనుకున్నట్టుగానే రాంచరణ్ ఆర్.ఆర్.ఆర్. తర్వాత ఆచార్యతో ఫ్లాప్ అందుకున్నాడు. మరి తారక్ ఈ సెంటిమెంట్ కు చెక్ పెడతాడేమో చూడాలి.

ఇక బాలీవుడ్ హీరోలు తెలుగు సినిమాల్లో మెరవడం, ఆ సినిమాకు అది కలిసిరావడం చాల తక్కువ సార్లు జరిగింది. అమితాబ్ బచ్చన్ ఒక్కడే తెలుగు లో కనపడి కొంత వరకు సక్సెస్ సాధించగలిగారు. ఇక సల్మాన్, సంజయ్ దత్, సునీల్ శెట్టి ఇలా అందరూ ఫ్లాప్ ని అందుకున్నవారు. ఈ కోవలోకే వస్తాడు సయీఫ్ అలీ ఖాన్. ఇతను నటించిన ఆదిపురుష్, ప్రభాస్ కెరీర్ లోనే పెద్ద డిజాస్టర్. ఇప్పుడు దేవర లో సైఫ్ అలీఖాన్ విలన్ గా నటిస్తున్నాడు. అతని వెంట బాలీవుడ్ పబ్లిసిటీ తో పాటు, బ్యాడ్ సెంటిమెంట్ కూడా ఫాలో అవుతుంది. ఈ సినిమా తో ఆ సెంటిమెంట్ బ్రేక్ అవుతుందేమో చూడాలి.

అయితే వీటితో పాటు అనిరుద్ మ్యూజిక్ అందించిన స్ట్రైట్ తెలుగు సినిమాల్లో జెర్సీ తప్ప బాక్స్ ఆఫీస్ వద్ద సక్సెస్ సాధించిన సినిమాలు ఏవి లేవు. ఆడియో పరంగా అనిరుద్ ఎక్కడ ఫెయిల్ అవ్వకపోయినా.. సినిమా రిసల్ట్ మాత్రం ఆశించిన విధంగా లేదు. సో ఇది దేవరను కాస్త కలవరపెడుతుంది. కానీ అన్నింటి కన్నా కథ గొప్పది కాబట్టి కొరటాల కథ తో మెస్మరైజ్ చేస్తే ఈ సెంటిమెంట్లన్నీ హిట్టులో కొట్టుకుపోతాయి అనడం లో సందేహం లేదు.

RELATED ARTICLES

Latest News

Recent Comments