Telugunewsfly: తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఏర్పాటు చేయనున్న యంగ్ ఇండియా స్కిల్స్ యూనివర్సిటీ నిర్మాణానికి అదానీ వంద కోట్ల విరాళం అందించారు. తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని కలిసి ఆయన అదానీ ఫౌండేషన్ తరపున వంద కోట్ల చెక్కును స్వయంగా అందజేశారు. అదానీ పోర్ట్స్ ఎండీ కరణ్ అదానీ, సీఎస్ శాంత కుమారి ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. ఈ విషయాన్ని తెలంగాణ సీఎం కార్యాలయం సోషల్ మీడియా ఎక్స్ వేదికగా ప్రకటించింది.
సీఎం రేవంత్ రెడ్డితో సమావేశం అనంతరం అదానీ సోషల్ మీడియా వేదికగా స్పందించారు. యంగ్ ఇండియా స్కిల్స్ యూనివర్సిటీ ఏర్పాటుకు సాయమందించే చొరవతో సీఎం రేవంత్ రెడ్డిని కలిసినట్టు ఆయన తెలిపారు. స్కిల్స్ యూనివర్సిటీ ద్వారా యువత భవిష్యత్తుకు బంగారు బాటలు వేస్తుందని.. ఇందుకు తమ సహకారం పూర్తిగా ఉంటుందని అదానీ ప్రకటించారు.