బడి బార్ అండ్ రెస్టారెంట్. బడి వైన్స్. ఆ వైన్స్ ఏంటి బడి ఏంటి అనుకుంటున్నారా.. అవును మరి బడి అనే పేరుతో వైన్స్ ఉంది. బార్ అండ్ రెస్టారెంట్ కూడా ఉంది. పెద్దలు బడిని మిస్ అవుతున్నారని ఇలా పెట్టారు అనుకుని, సోషియల్ మీడియాలో నాన్నలకు బడి వైన్స్, పెద్దల బడి బార్ అండ్ రెస్టారెంట్ అని కామెడీ మీమ్స్ వేస్తున్నారు.
అయితే ఈ బడి వైన్స్ , బార్ అండ్ రెస్టారెంట్ తిరుపతిలో ఉన్నాయి. ఈ పేరును ఎవరిని కించాపరచడనికో, కామెడీకి పెట్టలేదట. ఆ షాప్ ఓనర్ ఇంటి పేరు బడి కావడం తో అలా పెట్టుకున్నారని టాక్. ఏదేమైనా ఇంటి పేరు వింత పబ్లిసిటీకి పనికొచ్చింది.