Telugunewsfly: బూస్ట్ ఈజ్ ద సీక్రెట్ ఆఫ్ మై ఎనర్జీ అని సచిన్ చెప్పినట్టు.. చాలా మంది సంపాదనకు సీక్రెట్ ఎనర్జీ gold. ఇంట్లో ఎంతో కొంత బంగారం ఉంటే.. కష్టాల్లో ఉన్నపుడు bank లో పెట్టుకుని అప్పు తెచ్చుకోవచ్చు అనేది అందరికీ తెలిసిన విషయమే. కానీ మన బంగారం బ్యాంక్ వాళ్ళు పెట్టుకుని తిరిగి మనకే వడ్డీ ఇస్తారనే విషయం తెలుసా..?

అవును మన దగ్గర ఉన్న బంగారాన్ని bank వాళ్లకు ఇస్తే, దాన్ని పెట్టుకుని మనకు వడ్డీ ఇస్తారు. మనం ఇచ్చిన బంగారాన్ని, కాయిన్స్ గా గాని, బిస్కెట్ గా గాని మార్చి వాటి విలువకు తగ్గట్టుగా బ్యాంకులు వడ్డీని ఇస్తాయి. వడ్డీ 2.3 నుండి 2.5 శాతం వరకు ఉంటుంది. దీనికి 3 నుండి 5 సంవత్సరాలు లాకింగ్ పీరియడ్ ఉంటుంది. మనం ఎంచుకున్న లాకింగ్ పీరియడ్ వరకు మన బంగారాన్ని వెనక్కు తీసుకునే అవకాశం ఉండదు. లాకింగ్ పీరియడ్ ను బట్టి intrest rate నిర్ణయించబడుతుంది.

మనం gold బ్యాంకు నుండి తిరిగి తీసుకునే సమయంలో మనకు ప్యూర్ 24 క్యారెట్ కాయిన్స్ రూపంలో ఇస్తారు. ఎక్సెస్ బంగారాన్ని ఊరికే లాకర్లో పెట్టే బదులు, ఇలా చేస్తే వడ్డీ రాబట్టుకోవచ్చు.