Homeన్యూస్తెలంగాణMLC ఎన్నికల్లో.. కోదండరాంకు బిగ్ షాక్ !

MLC ఎన్నికల్లో.. కోదండరాంకు బిగ్ షాక్ !

: వరంగల్, ఖమ్మం, నల్లగొండ ఉపాధ్యాయ ఎమ్మెల్సీ ఎన్నికల్లో ఎమ్మెల్సీ ప్రొఫెసర్ కోదండరాంకు ఊహించని షాక్ తగిలింది. ఆయన మద్దతు ఇచ్చిన పన్నాల గోపాల్ రెడ్డికి కేవలం 24 ఓట్లు మాత్రమే వచ్చాయి. తెలంగాణ ఉద్యమ నాయకుడు, జేఏసీ చైర్మన్ గా ఉద్యమానికి సారథ్యం వహించిన కోదండరాం పన్నాల గోపాల్ రెడ్డిని గెలిపించాలని పిలుపు ఇచ్చినప్పటికీ టీచర్లు ఖాతరు చేయలేదు. ఉద్యమ నాయకుడు ప్రస్తుత ఎమ్మెల్సీ అయిన కోదండరాం ప్రచారం చేస్తే 24 ఓట్లు రావడం ఏంటని మేధావులు ముక్కు మీద వేలు వేసుకుంటున్నారు. మూడు ఉమ్మడి జిల్లాలలో 34 అసెంబ్లీ నియోజకవర్గాలలో నియోజకవర్గానికి ఒక్క ఓటు చొప్పున కూడా పడలేదు.

Kodanda Ram with CM Revanth Reddy
Kodanda Ram with CM Revanth Reddy

పన్నాల గోపాల్ రెడ్డికి వచ్చిన ఓట్లు చూసి ఆయనకు మద్దతు ఇచ్చి కోదండరాం తన స్థాయిని తగ్గించుకున్నాడని విద్యావంతులు అభిప్రాయపడుతున్నారు. కోదండరామ్ కు గవర్నర్ కోటాలో ఎమ్మెల్సీ ఇచ్చి కాంగ్రెస్ పార్టీ పరువు తీశాడంటూ మరోవైపు కాంగ్రెస్ శ్రేణులు అసహనం వ్యక్తం చేస్తున్నాయి. ఎమ్మెల్సీ కోదండరాం ప్రచారంతో ఒరిగిందేమిటో ఇప్పటికైనా కాంగ్రెస్ పార్టీ అర్థమైందా అంటూ మరోవైపు BRS శ్రేణులు సెటైర్లు వేస్తున్నాయి. కోదండరాం ఏపాటి ప్రజల నాయకుడో ఇప్పటికైనా కాంగ్రెస్ క్యాడర్ కు రేవంత్ రెడ్డికి అర్థమై ఉంటుంది అంటున్నారు మేధావులు.

RELATED ARTICLES

Latest News

Recent Comments