Telugunewsfly: కేంద్ర ప్రభుత్వం సంచలనమైన నిర్ణయం తీసుకుంది. భారత దేశ ఎన్నికల పర్వంలో అనూహ్యమైన మార్పులకు కారణమయ్యే బిల్లును తన కేబినెట్ లో ఆమోదించింది. ఇక పార్లమెంట్ సమావేశాల్లో ప్రవేశపెట్టాడమే మిగిలి ఉంది.
రామ్ నాథ్ కొవీంద్ నేతృత్వంలోని ప్యానెల్ వన్ నేషన్ వన్ ఎలెక్షన్ బిల్లుకి పచ్చ జెండా ఊపింది. కేంద్ర కేబినెట్ ఆమోదం పొందిన ఈ బిల్లు శీతాకాలం సమావేశాల్లో ఎటువంటి చర్చకు దారి తీస్తుందో చూడాలి. ఒకవేళ బిల్లు సభలో ఆమోదం పొందితే అసెంబ్లీ, పార్లమెంటుకు ఒకేసారి దేశం మొత్తం ఎన్నికలు నిర్వహించాల్సి ఉంటుంది.