Telugunewsfly: నవ్వు నాలుగు విదాల చేటు అంటారు ఒకరు. కాదు నవ్వడం ఒక భోగం, నవ్వించడం ఒక యోగం అంటారు ఇంకొకరు. ఇలా ఎంతసేపు నవ్వు గురించి మాట్లాడే వారు, దాని వల్ల కలిగే లాభాల గురంచి చెప్పేవారే కానీ ఏడుపు గురించి ఎవ్వరూ మాట్లాడరేంటి..? ఏడుపంటే అంత చీప్ అయిపోయిందా అందరికీ… అసలు ఏడ్వడం వల్ల ఎన్ని ప్రయోజనాలు ఉన్నాయో తెలుసా.. అయిన తెలిస్తే అలా అనరు లెండి. అవేంటో ఇక్కడ చదివి తెలుసుకోండి..
ఏడుపు వల్ల కలిగే హెల్త్ బెనిఫిట్స్:
- ఏడ్వడం వలన మన కన్నీళ్ల ద్వారా మనకు హాని కలిగించే బ్యాక్టీరియా అంత బయటకి వెళ్ళిపోతుంది.
- ఏడుపు మన రోగ నిరోధక శక్తిని కూడా పెంచుతుంది. మనల్ని బలంగా తయారు చేస్తుంది.
- అన్నిటికన్నా ముఖ్యమైనది బాధంతా బయటకి వెళ్ళేలా ఏడిస్తే మానసికంగా ఉన్న ఒత్తిడి తగ్గి ప్రశాంతత లభిస్తుంది.
- ఏడవకుండా బాధను లోపల అణచివేస్తే, అది బ్రెయిన్ మీద ప్రభావం చూపే అవకాశం ఉంది. అందుకే మన బ్రెయిన్ కోసమైనా మనం కాస్త ఏడవాలి.
- ఏడవడం వల్ల గుండె సంబంధిత వ్యాధులకు కూడా దూరంగా ఉండొచ్చు.
ఇలా ఏడుపు వల్ల కూడా మనకు లాభాలు ఉన్నాయి. అందుకే ఎప్పుడు నవ్వడమే కాదు. అప్పుడప్పుడు ఎడవండి. అలా అని రోజు ఓ గంట ఎడవకండి ఏడుపుగొడ్డొల్లు అంటారు.