Telugunewsfly.com : పరీక్షల్లో తక్కువ మార్కులు వచ్చాయని బాధపడటం, ఆత్మహత్య చేసుకోవడం వంటి ఘటనలు పునరావృతం అవుతూనే ఉన్నాయి. అయితే అసలు పరీక్షలు రాయకముందే ఫెయిల్ అవుతాననే భయంతో ఓ విద్యార్థిని ఆత్మహత్య చేసుకున్న సంఘటన మంచిర్యాల జిల్లాలో జరిగింది. జిల్లాలోని జైపూర్ మండలం షెట్ పల్లి గ్రామానికి చెందిన హాసిని (18) చెన్నూరులోని కస్తూర్బా గాంధీ విద్యాలయంలో ఇంటర్మీడియట్ చదువుతోంది. హాసినికి మొదటి నుంచి చదువు మీద ఇష్టం లేదు. దీంతో హాస్టల్ నుంచి ఇంటికి వచ్చేసింది. ఈ విషయమై కోప్పడ్డ హాసిని తండ్రి ఆమెను బలవంతంగా మంచిర్యాలలోని వేరే ప్రైవేట్ కళాశాలలో చేర్పించాడు. చదువు మీద శ్రద్ధ పెట్టలేక పోవడం.. ఇంటర్ పరీక్షలు దగ్గర పడుతుండడంతో ఫెయిల్ అవుతానని భయపడి ఇంట్లో ఉరి వేసుకొని ఆత్మహత్య చేసుకుంది. హాసిని ఒత్తిడిని అర్థం చేసుకొని చదువు మాన్పించినా బిడ్డ బతికి ఉండేది అని తల్లిదండ్రులు కన్నీరు మున్నీరుగా విలపిస్తున్నారు.
ఫెయిల్ అవుతాననే భయంతో.. విద్యార్థిని ఆత్మహత్య !
RELATED ARTICLES