TelugunewsFly : కేజ్రీవాల్ తన స్థానంలో అతిశీ మర్లేనాను ముఖ్యమంత్రిగా ప్రకటించిన విషయం తెలిసిందే. ఈ నెల 26, 27 తేదీల్లో ఢిల్లీ అసెంబ్లీ ప్రత్యేకంగా సమావేశం కానుంది. ఈ సమావేశాల్లోనే అతిశీ ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేస్తారు. ఈ సందర్భంగా అతిశీ గురించి కొన్ని ఆసక్తికర విషయాలు మీకోసం..
ఢిల్లీ ముఖ్యమంత్రిగా అరవింద్ కేజ్రీవాల్ రాజీనామా చేసి తన స్థానంలో కొత్త సీఎంగా అతిశీ మర్లేనా పేరును ప్రకటించిన విషయం తెలిసిందే. కేజ్రీవాల్ ప్రతిపాదనను ఆప్ శాసనసభా పక్షం ఏకగ్రీవంగా ఆమోదించడంతో అతిశీ మర్లేనా ఢిల్లీ సీఎంగా బాధ్యతలు స్వీకరించనున్నారు. మేరకు ఢిల్లీ లెఫ్టినెంట్ గవర్నర్ వీకే సక్సేనాకు అరవింద్ కేజ్రీవాల్ రాజీనామా సమర్పించారు. మద్యం కుంభకోణం కేసులో అరెస్టై.. బెయిల్ మీద రిలీజైన కేజ్రీవాల్ ముఖ్యమంత్రి పదవికి రాజీనామా చేస్తూ సంచలన నిర్ణయం తీసుకున్నారు. దంతో.. ఢిల్లీలో రాజకీయం ఒక్కసారిగా మారిపోయింది. ఈ కేసులో తాను నిర్దోషినని నిరూపించుకున్న తర్వాతే మళ్లీ సీఎం కుర్చీలో కూర్చుంటానని ప్రకటించిన కేజ్రీవాల్ నవంబర్ నెలలో మధ్యంతర ఎన్నికలు నిర్వహించాలని డిమాండ్ చేశారు.
అతిశీ మర్లేనా 1981 జూన్ 8న విజయ్ సింగ్, త్రిప్తా వాహీ దంపతులకు జన్మించారు. అతిశీ తల్లిదండ్రులిద్దరూ ప్రొఫెసర్లే. 2018 జాతీయ ఎన్నికల సమయంలో అతిశీ తన పేరు మార్చుకున్నారు. అంతకు ముందు ఆమె పేరు మర్లేనా. ఆక్స్ ఫర్డ్ యూనివర్సిటీ నుంచి అతిశీ మాస్టర్స్ డిగ్రీ పూర్తి చేశారు. 2013లో ఆమ్ ఆద్మీ పార్టీలో చేరారు. 2020 ఎన్నికల్లో కల్కాజీ నియోజకవర్గం నుంచి పోటీ చేసి బీజేపీ క్యాండిడేట్ ధరంబీర్ సింగ్ ని ఓడించారు. ఆ ఎన్నికల్లో అతిశీ 11వేల 422 ఓట్ల మెజారిటీతో గెలిచారు. లిక్కర్ కేసులో మనీష్ సిసోడియా, సత్యేంద్ర జైన్ లు అరెస్ట్ కావడంతో అనూహ్యంగా అతిశీకి ఢిల్లీ క్యాబినేట్ లో చోటు దక్కింది. ప్రస్తుతం ఆమె స్త్రీ – శిశు సంక్షేమం, సంస్కృతి, పర్యాటక, ప్రజా పన్నుల శాఖ మంత్రిగా ఉన్నారు. ఇక ఢిల్లీ ముఖ్యమంత్రుల విషయానికొస్తే 1998లో సుష్మా స్వరాజ్ 52 రోజుల పాటు ఢిల్లీకి తాత్కాలిక ముఖ్యమంత్రిగా పనిచేశారు. ఆ తర్వాత మూడు సార్లు కాంగ్రెస్ ముఖ్యమంత్రిగా షీలా దీక్షిత్ పనిచేశారు. ఇప్పుడు ఢిల్లీని పాలించే మూడవ మహిళగా అతిశీ మర్లేనా పదవీ బాధ్యతలు స్వీకరించనున్నారు.