TeluguNewsFly : ఇండియాలో ప్లాస్టిక్ వాడకం గురించి ప్రత్యేకంగా ప్రస్తావించాల్సిన అవసరం లేదు. కాలుష్యం వినియోగం విషయంలో భారత్ ప్రపంచంలోనే ఐదో స్థానంలో ఉంది. తాజాగా నేచర్ అనే ఓ మ్యాగజైన్ చేసిన అధ్యయనంలో ఆసక్తికర విషయాలు వెలుగులోకి వచ్చాయి. ఇండియాలో ప్రతి ఏడాది 5.8 మిలియన్ టన్నుల ప్లాస్టిక్ కాల్చేస్తున్నారట. 3.5 మిలియన్ టన్నుల ప్లాస్టిక్ ను చెత్తరూపంలో పర్యావరణంలోకి విడుదల చేస్తున్నారు. ఇలా మొత్తం ఏడాదిలో ఇండియాలో 9.3 మిలియన్ టన్నుల ప్లాస్టిక్ కాలుష్యం జరుగుతోంది. నైజీరియా, ఇండోనేషియా, చైనాలో ఇది మరీ ఎక్కువగా ఉంది. ప్రపంచంలో జరుగుతున్న ప్లాస్టిక్ కాలుష్యం మీద లీడ్స్ యూనివర్సిటీ చేసిన పరిశోధనలో ఈ విషయాలు వెలుగు చూశాయి. ప్రపంచవ్యాప్తంగా మొత్తం ఏడాదికి 251 మెట్రిక్ టన్నుల ప్లాస్టిక్ వ్యర్థాలు ప్రకృతిని పాడు చేస్తున్నాయి.
వ్యర్థాలను రీసైకిల్ చేయాలన్నా.. ల్యాండ్ ఫీల్ కి పంపాలన్నా.. మొత్తం 2లక్షల ఒలంపిక్ స్విమ్మింగ్ పూల్ లు నిండుతాయట. ఈ వ్యర్థాలల్లో ఐదవ వంతు అంటే.. 52. మెట్రిక్ టన్నుల వ్యర్థాలు పర్యావరణంలోకి విడుదలవుతాయి. ప్రపంచంలోని ప్లాస్టిక్ వ్యర్థాలన్నీ ఒకచోట గుట్టలా పోస్తే.. ఎవరెస్ట్ పర్వతం కంటే ఎత్తు ఉంటాయట. పసిఫిక్ మహాసముద్రం మొత్తం నింపేసి పూడ్చేసేంత ప్లాస్టిక్ వ్యర్థాలు ప్రపంచంలో ఉన్నాయట. ఈ రేంజ్ లో ప్లాస్టిక్ వ్యర్థాలు వాడుతున్నామంటే మనం ప్రకృతికి ఎంత కీడు చేస్తున్నామో ఒకసారి ఆలోచించండి. ప్రపంచ దేశాల్లోని 20 దేశాల నుంచే 69 శాతం కాలుష్యం విడుదలవుతోందట. ప్లాస్టిక్ కాలుష్యం వల్ల ప్రకృతిలోకి కార్బన్ మోనాక్సైడ్ వంటి విష వాయువులు రిలీజ్ అవుతాయి. దీని వల్ల గుండె, శ్వాసకోశ సంబంధ వ్యాధులు వస్తాయి. ఇప్పటికే ప్రపంచవ్యాప్తంగా 22.2 మెట్రిక్ టన్నుల ప్లాస్టిక్ వ్యర్థాలు శిథిలాలుగా పేరుకుపోయాయి. అంటే.. మొత్తం ప్లాస్టిక్ వ్యర్థాల్లో ఇవి 43 శాతం అన్నమాట.
ప్లాస్టిక్ కాలుష్యం మీద అంతర్జాతీయ స్థాయి ఒప్పందంపై పలు దేశాల మధ్య చర్చలు జరుగుతున్న నేపథ్యంలో జరిగిన ఈ అధ్యయనం ఆసక్తి రేపుతోంది. యూఎన్ ఎన్విరాన్ మెంట్ అసెంబ్లీ 2024 చివరి నాటికి.. ఈ ఒప్పందాన్ని అమలు చేయాలని భావిస్తున్నారు. ఇందుకోసం 2025లో వాతావరణ మార్పుపై జరుగనున్న పారిస్ ఒప్పందం ముఖ్యమైనది కావొచ్చని నిపుణుల అభిప్రాయం.