Telugunewsfly.com : ఛాంపియన్స్ ట్రోఫీలో ఈరోజు న్యూజిలాండ్ తో తలపడిన భారత్… 50 ఓవర్లలో 9 వికెట్లు కోల్పోయి 249 పరుగులు చేసింది. మ్యాచ్ చివర్లో ఆల్ రౌండర్ ప్రతిభ చూపిన హార్దిక్ పాండ్యా 4 ఫోర్లు.. 2 సిక్సులతో 45 పరుగులు చేసి భారత్ కి గౌరవప్రదమైన స్కోరు సాధించేందుకు కారణమయ్యాడు.
మ్యాచ్ ప్రారంభంలోనే టీమిండియాకు భారీ ఎదురు దెబ్బ తగిలింది. టాప్ ఆర్డర్ పేకమేడలా కూలిపోయింది. 30 పరుగులకే 3 కీలక వికెట్లు కోల్పోయింది. అక్షర్ పటేల్, శ్రేయాస్ అయ్యర్ 98 పరుగుల భాగస్వామ్యంతో ఇన్నింగ్స్ నిలబెట్టారు. 42 పరుగులు చేసి అక్షర్ ఔటయ్యాడు. 79 పరుగులతో సెంచరీ చేస్తాడని ఆశ కల్గించిన శ్రేయాస్ అయ్యర్ షార్ట్ బాల్ ఆడి వెనుదిరిగాడు. కేఎల్ రాహుల్ 23, రవీంద్ర జడేజా 16 పరుగులు చేయగా.. నిర్ణీత 50 ఓవర్లలో భారత్ 249 పరుగులు చేసి ఆలౌట్ అయింది. 250 పరుగుల లక్ష్యంతో ఛేజింగ్ కి దిగిన కివీస్ టార్గెట్ రీచ్ అవుతుందా.. లేక ఛాంపియన్స్ ట్రోఫీలో భారత్ హవా కొనసాగుతోందా చూడాలి.