Homeన్యూస్ఆంధ్రప్రదేశ్పవన్ కళ్యాణ్ అంత చేత కానివాడయ్యాడా..?

పవన్ కళ్యాణ్ అంత చేత కానివాడయ్యాడా..?

పవన్ కళ్యాణ్ కు అటు ప్రధాని మోడీ దగ్గర ఇటు ముఖ్య మంత్రి చంద్రబాబు దగ్గర ప్రత్యేక స్థానం ఉంది. ఆయన ఏదైనా అనుకుంటే చాలు వెంటనే అది జరిగి తీరుతంది అనే ప్రచారం బయట జరుగుతుంది. పైగా ఆయన కూడా మోడీ గారితో నాకు సాన్నిహిత్యం ఉంది అని చెప్పుకున్నారు. మరి ఇంత పలుకుబడి ఉన్న పవన్ కు ఒక్క పని మాత్రం ఎందుకు చేయలేకపోతున్నారు.

https://telugunewsfly.com/pawankalyantamilpiliticsgame
pawan kalyan telugunews fly

ఎన్నికల ముందు విశాఖ స్టీల్ ప్లాంట్ గురించి పవన్ కల్యాణ్ కూడా మాట్లాడారు. కూటమి ప్రభుత్వం వచ్చాక ప్రైవేటీకరణ ఆపుతామన్నారు. ఇప్పుడు మాత్రం ఆ విషయాన్ని అంతగా సీరియస్ గా తీసుకున్నాట్టులేరు పవన్ అని ప్రజలు అనుకుంటున్నారు. ఎందుకంటే ఆయన సీరియస్ గా దృష్టి పెడితే ఖచ్చితంగా privatisation ఆగి తీరుతుంది అనే నమ్మకం ప్రజల్లో ఉంది.

https://telugunewsfly.com/pawankalyanonvizagsteelplant/
Vizag steel plant telugunews fly

అయితే మేధావులు అందరూ చెప్తున్న ప్రకారం స్టీల్ ప్లాంట్ కు ఒక ఇనుప ఘని (iron ore) ను కేటాయిస్తే, ఈ సంస్థ ఇప్పుడున్న అన్ని ప్రైవేట్ స్టీల్ ప్లాంట్లకన్నా ఎక్కువ లాభాలను సాధించి పెడుతుంది. అలాగే స్టీల్ ప్లాంట్ కు  రైల్వే వాగన్ ను కూడా కేటాయించాలి.ఇవి రెండు కేంద్ర ప్రభుత్వం చేయాల్సిన పనులే.

https://telugunewsfly.com/centralcabineton…ononeelectiobill
One nation one election telugunews fly

మరి పవన్ కు ఉన్న పలుకుబడిని ఉపయోగించి ఈ రెండు పనులను ఈజీగా చేయించగలడు అని స్టీల్ ప్లాంట్ ఉద్యోగులు ఆయన మీద ఎన్నిఆశలు పెట్టుకున్నారు. పైగా కేంద్రం లో కూటమి ప్రభుత్వానికి, ఆంధ్ర ప్రదేశ్ ఎంపీలు చాల అవసరం.  పైగారామ్మోహన్ నాయుడు లాంటి నేతలు ఉత్తరాంధ్ర నుండి ఎంపికైన వారే కాబట్టి వారు ఈ సమస్యను మరింత సీరియస్ గా తీసుకోవాలి. అటు ప్రతిపక్షాలు దీనిపైన ఉద్యమం చేస్తాము అని అంటున్నాయి. అలా జరిగితే ముందుగా విమర్శలు ఎదుర్కునేది పవన్ కళ్యాణ్ అవుతారు. ఎందుకంటే చంద్రబాబు కన్న పవన్ కే మోడీ ఎక్కువ ఇంపార్టెన్స్ ఇస్తున్నారు అనే ఇమేజ్ ఉంది కాబట్టి. పవన్ కళ్యాణ్ మౌనంగా ఉంటే ఆయన కొత్తగా అవినీతి ఆరోపణల్లో కూరుకుపోయే అవకాశం ఉంది. ఇప్పటివరకు అలాంటి ఆరోపణలు కళ్యాణ్ మీద రాలేదు. అందుకే ఉపముఖ్యమంత్రిగా పవన్ కళ్యాణ్ రాష్ట్ర ప్రయోజనాలను కాపాడే పనులకు ఇంపార్టెన్స్ ఇచ్చి, కేంద్రం లో తన పలుకుబడిని ఉపయోగిస్తే స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ ఆగుతుంది.

RELATED ARTICLES

Latest News

Recent Comments