సెప్టెంబర్ 17 తెలంగాణ విమోచన దినోత్సవం. తెలంగాణ ఉద్యమ కాలం నుండి ఈ తేదీ చుట్టూ రాజకీయం రగులుతూనే ఉంటుంది. దీన్ని నిజాం పాలన నుండి తెలంగాణ విముక్తి పొందినందుకు గుర్తుగా ప్రభుత్వం అధికారికంగా జాతీయ జెండా ఎగురవేసి సంబరాలు జరపాలని వాదనలు నడుస్తూనే ఉంటాయి. అయితే ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం దీన్ని ప్రజా పాలన గా ప్రకటించి అధికారికంగా నిర్వహించాలని నిర్ణయించింది.
అయితే ఈ కార్యక్రమంలో నేను పాల్గొనబోవడంలేదని కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి లేఖ రాశారు. చరిత్రను తుడిచివేసే కార్యక్రమంలో భాగం కాలేను అని లేఖలో పేర్కొన్నారు. ఈ నిర్ణయం మరోసారి రాజకీయ చర్చలకు దారి తీసింది.