Telugunewsfly.com : రేపటి నుంచి తెలంగాణ అసెంబ్లీ సమావేశాలు ప్రారంభం కానున్నాయి. బడ్జెట్ ప్రవేశ పెట్టడంతో పాటు.. బీసీ రిజర్వేషన్లు, కుల గణన, రుణమాఫీ, సాగునీటి సమస్య వంటి పలు అంశాలపై చర్చ జరగనుంది. ఈ నెల 19 లేదా.. 20 తారీఖున డిప్యూటీ సీఎం, ఆర్థిక మంత్రి భట్టి విక్రమార్క వార్షిక బడ్జెట్ ప్రవేశ పెట్టనున్నారు.
బడ్జెట్ సెషన్ సందర్భంగా అసెంబ్లీ దగ్గర మూడంచెల భద్రత ఏర్పాటు చేశారు. నిరసనలు, ర్యాలీలు, ధర్నాలకు అనుమతి లేదని పోలీసులు ప్రకటించారు. రేపు ఉదయం 11 గంటలకు ఉభయ సభలను ఉద్ధేశించి గవర్నర్ ప్రసంగిస్తారు. ఇప్పటికే అన్ని శాఖల ఉన్నతాధికారులతో డిప్యూటీ సీఎం భట్టి, మంత్రుల సమావేశమై అసెంబ్లీ సమావేశాలకు సంబంధించిన అంశాలపై.. సమీక్ష నిర్వహించారు. ఆయా శాఖలకు బడ్జెట్ లో నిధుల కేటాయించడంపై ప్రతిపాదనలు సభలో ప్రవేశ పెట్టనున్నారు. 2025-26 ఆర్థిక సంవత్సరానికి ఈసారి 3 లక్షల 20 వేల కోట్ల బడ్జెట్ ప్రవేశ పెట్టే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది.