Telugunewsfly: పవన్ కళ్యాణ్ ఈ పేరు తెలియని వారు ఎవరైనా ఉంటారా..? దేశవ్యాప్తంగా కోట్ల మంది అభిమానులు ఉన్న స్టార్ హీరో పవన్. పవర్ స్టార్ గా ఆయన సంపాదించుకున్న పాపులారిటీ అనితర సాధ్యం. ఇక రాజకీయాలలో అతను సృష్టించిన తుఫాన్ గురించి స్వయంగా మోడీ తన మాటల్లోనే దేశం అంత వినపడేలా చెప్పారు. అయినా కూడా ఏపీ డిప్యూటీ సీఎం ఎవరు అని తెలియక ఆలోచనలో పడ్డారు ఆ దంపతులు..
కౌన్ బనేగా కరోడ్ పతి సీసన్ 16 లో ఒక ఎపిసోడ్ లో పార్టిసిపెంట్స్ గా వచ్చిన వృద్ధ దంపతులకు 9 వ ప్రశ్న గా.. ఏపీ డిప్యూటీ సీఎం ఎవరు అనే ప్రశ్న ఎదురైంది.. దాంతో వారికి సమాధానం తెలియక చివరికి ఆడియన్స్ పోల్ లైఫ్ లైన్ తీసుకుని సమాధానం చెప్పారు. ఇక వారి ఇన్నోసెన్స్ ని చూసి, పవన్ కళ్యాణ్ అంటే చిరంజీవి చిన్న తమ్ముడు అని అమితాబ్ బచ్చన్ వివరించి చెప్పాడు.
అలా ఏపీ డిప్యూటీ సీఎం ఎవరో తెలుసుకున్నారు.వారు చెప్పిన ఆ సమాధానానికి గాను వారు
1 ,60 ,౦౦౦/- రూపాయలు గెలుచుకున్నారు.