ఏదైనా వస్తువు కొనడానికి వెళితే ముందుగా బ్రాండెడ్ కంపెనీలు తయారుచేసిన వస్తువులకే ప్రాధాన్యతనిస్తాం. అందుకు కారణం ఆ కంపెనీలు ఇచ్చే నాణ్యత. ఇలా ఆయా రంగాల్లో కొన్ని కంపెనీలు తమ బ్రాండ్ ను ఏర్పరుచుకున్నాయి. టీవీలు, స్పీకర్లు అంటే సోనీ, ఫోన్లు అంటే నోకియా, పేస్ట్ అంటే కొల్గెట్ ఇలా బ్రాండ్ పడిపోయింది. కానీ ఈ కంపెనీలు స్థాపించినప్పుడు వేరే ప్రొడక్ట్ లు తయారు చేసేవి అని మీకు తెలుసా…
నోకియా:
ఇప్పుడంటే mi, one plus.. అంటూ రకరకాల బ్రాండ్ ఫోన్లు వచ్చాయి కానీ, ఒకప్పుడు ఫోన్ అంటే నోకియా అన్నట్టుగా ఉండేది పరిస్థితి. అంతగా పేరుపడ్డ నోకియా మొదటగా తయారు చేసింది మాత్రం ఫోన్లు కాదు, టాయిలెట్ ప్పేపర్లు. నమ్మలేక పోతున్నారా.. నమ్మకపోయినా ఇదే నిజం. 1865 లో నోకియా కంపెనీ స్థాపించినప్పుడు టాయిలెట్ రోల్స్ తయారు చేసేది. తరువాత కాలంలో ఫోన్ తయారు రంగంలోకి అడుగుపెట్టి ఒకానొక టైం లో ప్రపంచంలో సగం మొబైల్ యూసర్స్ నోకియానే వాడేంత ఫేమస్ ఐపోయింది.
సోనీ:
టి. వి. కొనలంటే సోనీ, స్పీకర్లు, హోమ్ థియేటర్ సౌండ్ క్వాలిటీగా ఉండాలంటే సోనీ. ఇలాంటి బ్రాండ్ ఇమేజ్ ఉన్న సోనీ ఫస్ట్ ప్రొడక్ట్ మాత్రం ఎలక్ట్రిక్ రైస్ కుక్కర్. 1940ల్లో సోనీ ఎలక్ట్రిక్ కుక్కర్లు తయారు చేసింది.
కోల్గెట్:
1806 వ సంవత్సరంలో విలియం కోల్గెట్ న్యూయార్క్ సిటీలో క్యాండిల్స్, సోప్స్ అమ్మేవారు. అలా అంచలంచలుగా ఎదుగుతూ…1896 లో మొదటిసారిగా టూత్ పేస్ట్ ను మార్కెట్ లోకి రిలీజ్ చేసి.. ఇప్పటికీ అందరి నోళ్ళలో నానుతుంది.
ఇలా టొయోట కంపెనీ బట్టలు నేసే మగ్గాలు, ఐకియా వాళ్లు పెన్నులు, మహీంద్రా వారు స్టీల్ ట్రేడింగ్ వ్యాపారాలు చేసేవారు.