వినాయక నిమజ్జనం రోజు లడ్డూ వేలం పాట క్రేజ్ మాములుగా ఉండదు. పోటీ పడి వేలంలో లడ్డూ దక్కించుకుంటారు చాలా మంది. అది సెంటిమెంట్ కావొచ్చు, ప్రెస్తేజ్ కావొచ్చు, నిజమైన భక్తి అయ్యుండొచ్చు. లడ్డూ గెలుచుకుని కొంతమంది చుట్టూ పక్కల వాళ్ళకి పంచిపెడతారు. మరికొంతమంది పొలాల్లో చల్లుకుంటే సాగుబడి బాగా జరిగి దిగుబడి పెరుగుతుందని నమ్ముతారు.
ఇక ఈ హంగమాను న్యూస్ ఛానల్స్ లో లైవ్ కవరేజ్ లు కూడా ఉంటాయంటే జనాల్లో వేలం పాట గురించి ఎంత ఆసక్తి ఉందో అర్థమవుతుంది.ఇంత పాపులర్ అయిన లడ్డూ వేలం కార్యక్రమాన్ని మొట్ట మొటిసారిగా ఎక్కడ స్టార్ట్ చేశారు.
ఇండియాలో మొదటిసారిగా 1994 లో జరిగింది. అది ఎక్కడో కాదు లడ్డూ వేలం పాటకు ఫేమస్ అయిన హైదారాబాద్ లోని బాలాపూర్ లోనే తొలిసారి లడ్డూ వేలం వేశారు. ఆ ఊరికి చెందిన రైతు కొలన్ మోహన్ రెడ్డి ఆ లడ్డును గెలుచుకున్నారు. 450 రూపాయలకు ఆయన పాట పాడి వేలంలో గణేషుని లడ్డూ దక్కించుకున్నాడు.ఆ తరువాత ఆయనకు చాలా బాగా కలిసి వచ్చిందని చెప్తారు. ఇక ఆ నమ్మకంతో ప్రతి ఏటా లడ్డూకు డిమాండ్ పెరిగింది. పోటీ పెరిగింది. ఈ వేలం పాట సంప్రదాయం మిగితా అన్నిచోట్ల వ్యాపించింది. ఆ క్రేజ్ లక్షలు దాటి కోట్లకు కూడా చేరుతుంది.