Telugunewsfly: బంగారానికి ఉన్న క్రేజ్ ఎప్పటికీ తగ్గిపోదు, అది అందరికీ తెలిసిన విషయమే. అయితే ఈ క్రేజ్ ను మనకు అనువుగా మార్చుకోవడంలోనే ఉంది అసలైన ట్రిక్కు. బంగారం కాస్త తగ్గాక తీసుకుందాము అనుకున్నా ప్రతిసారి రేటు పెరుగుతుంది. తీసుకోగానే కాస్త తగ్గుతుంది. దీంతో కాస్త నిరాశకు గురవుతము. అయితే ఈ దీపావళికి అలా జరగకూడదు అంటే ఏం చెయ్యాలి..?

ఇప్పుడు బంగారం 78 వేల మార్కు రీచ్ అయ్యింది. మనం కొని చేతులోకి వచెప్పటికి మనకు 80 వేలకు దొరుకుతుంది. అయితే ఇంకా ఆలోచిస్తూ.. తగ్గుతుందేమో అనుకునేవాళ్లు త్వరపడండి. ఎందుకంటే ఈ పండగ అయ్యే లోపు బంగారం ధర ఇంకా పెరగబోతుంది.

అంతర్జాతీయ స్థాయిలో నెలకొన్న పరిస్థితులు gold rate పెరుగుదలకు కారణమవుతున్నాయి. ఒక వైపు యుద్ధాలు, మరో వైపు అమెరికా లాంటి అగ్ర రాజ్యం లో recession రాబోతుండడం. ఇలా పెట్టుబడులన్నీ ఇప్పుడు సురక్షితంగా ఉండే బంగారం వైపే వస్తున్నాయి. అందువల్ల డిమాండ్ పెరిగి ధర మరింత పెరిగే అవకాశం ఉంది. మన దేశం లో ధనత్రయోదశి, దీపావళి వంటి పండగలకు సెంటిమెంట్ గా బంగారం కొనుగోలు చేస్తారు కాబట్టి gold డిమాండ్ పెరగనుంది. అందుకే పండగ ముందే కొనేసుకుంటే రేట్ కలిసి వస్తుంది. పండగకు ఇంటికి లక్ష్మి వచ్చింది అనే భావన కలుగుతుంది. ఏ రకంగా చూసినా ఉపయోగకరమే.